ప్రస్థుతం అల్లు అర్జున్ మ్యానియా కొనసాగుతోంది ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తో బన్నీ రికార్డ్స్ క్రియేట్ చేయడంతో అతడి మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. మరొక టాప్ హీరో సినిమా విడుదల అయి బ్లాక్ బష్టర్ వచ్చే వరకు ‘అల’ మ్యానియా కొనసాగుతూనే ఉంటుంది. 

ఇలాంటి పరిస్థితులలో వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న గోపీ చంద్ ఇప్పుడు అల్లు అర్జున్ మ్యానియాను నమ్ముకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇతడు దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి ‘సిటీమార్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. బన్నీ నటించిన ‘డిజే’ మూవీలో ఉన్న ‘సిటీమార్’ పాట సూపర్ హిట్. 

ఈ పాట అప్పట్లో మెగా అభిమానుల సెల్స్ లో విపరీతంగా రింగ్ టోన్ గా వినిపించేది. ఇప్పుడు గోపీ చంద్ సినిమాను సగటు ప్రేక్షకుడు పట్టించుకునే స్థితిలో లేని పరిస్థితులలో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా బన్నీ సినిమా గుర్తుకు వచ్చే విధంగా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేసారు అని అనుకోవాలి. వాస్తవానికి ‘రచ్చ’ సినిమా తరువాత దర్శకుడు సంపత్ నంది ఎన్ని సినిమాలు తీసినా ఆ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. 

ఇక గోపీ చంద్ విషయానికి వస్తే ‘లౌక్యం’ తరువాత అతడు ఎన్ని సినిమాలలో నటిస్తున్నా అతడిని సక్సస్ పలకరించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో గోపీ చంద్ మార్కెట్ పూర్తిగా పడిపోవడమే కాకుండా అతడితో సినిమాలు తీయడానికి యంగ్ డైరెక్టర్స్ కూడ ఆసక్తి చూపని పరిస్థితి. ప్రభాస్ లాంటి మంచి మిత్రుడు గోపీచంద్ కు ఉన్నా ఆ స్నేహం గోపీ చంద్ ను గట్టెక్కించ లేకపోతోంది. దీనితో ప్రస్తుతం సక్సస్ అవసరమైన గోపీ చంద్ సంపత్ నందులు కలిసి అల్లు అర్జున్ మ్యానియా పై ఆధారపడి చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సస్ ను ఇస్తుందో ఈ సమ్మర్ లో తేలిపోతుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: