బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారిలో షారూఖ్ ఖాన్ ఒకరు.  బాలీవుడ్ బాద్ షా గా పిలుచుకునే ఆ మల్టీటాలెంటెడ్ హీరో వెండి తెరపైనే కాదు... బుల్లితెరపై కూడా తన యాంకరింగ్ తో అందరినీ మంత్ర ముగ్దులను చేస్తారు.   బాలీవుడ్ లో అత్యంత ధనికుల్లో షారూఖ్ ఖాన్ ఒకరు.  అయితే ఆయన ఈ స్థానానికి రావడానికి ఎంత కష్టపడ్డారో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా షారుక్‌ ఖాన్   తాజాగా  కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌​ రెమో డి సౌజాతో కలిసి  డాన్స్‌ ప్లస్‌ సీజన్‌  5లో పాల్గొన్నారు. 

 

ఈ కార్యక్రమానికి రెమో జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  ప్రతి సీజన్ కి ఎవరో ఒక సెలబ్రెటీలను పిలిచి ఆ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకు వస్తుంటారు నిర్వాహకులు. కాగా, డాన్స్‌ ప్లస్‌ షోలో గణతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్‌లో షారుక్  కనిపించనున్నారు. ఇందుకు తాజ్‌ మహల్‌ కటౌట్‌ నేపథ్యంలో 20నిమిషాల పాటు పలు పాటలకు డాన్స్‌  చేయనున్నట్లు  సమాచారం. ఈ  సందర్భంగా షారుక్‌ తన కెరీర్‌ ప్రారంభంలోని అనుభూతులను నెమరువేసుకున్నారు. తాను కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న వేషాలు వేయడానికి సిద్ద పడ్డానని... అదే సమయంలో టివి లో చాన్సు రావడం... తర్వాత వెండితెరపై నటుడిగా అవకాశం రావడం వెంట వెంటనే జరిగిపోయాయి.

 

నా  మొదటి సంపాదన రూ.50తో తాజ్‌ మహాల్‌ కి వెళ్లి తెగ తిరిగి వచ్చానన్నారు.  అయితే అప్పటికే డబ్బులు పూర్తిగా అయిపోయాయని. రైలు టిక్కెటు కొన్న తర్వాత  తన  దగ్గర  కేవలం  లస్సీ కొనుగోలుకు మాత్రమే డబ్బులు  ఉన్నాయి. నేను లస్సీ కొనుకున్నాను. అనుకోకుండా ఆ లస్సీలో ఓ తేనటీగ పడిందని.. ఎవరూ చూడకముందే దాన్ని తీసేసి గుటుక్కున లస్సీ తాగేశానని అన్నారు.  నాకు 95 ఏళ్లు వచ్చినా  రైలు పైనా,  వీల్‌ చైర్‌లో అయినా సరే ఛయ్యా.. ఛయ్యా పాటకు డాన్స్‌ చేస్తూనే ఉంటానని అన్నారు.. అయితే నా వెంట మాత్రం రెమో ఖచ్చితంగా ఉంటారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: