ఎట్టకేలకు నిన్న శాసనమండలిలో వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజు టీడీపీ ఎమ్మెల్సీలు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నప్పటికీ తర్వాత మంత్రుల ఒత్తిడి తో చర్చకు వచ్చింది. ఇక దీనికి సంబంధించిన చర్చలు కూడా రసాభాస గానే సాగింది నిన్న శాసనమండలిలో. టిడిపి వైసిపి సభ్యుల మధ్య వాదోపవాదాలు విమర్శలు ప్రతివిమర్శలు మధ్య శాసన మండలి సమావేశం మొత్తం హాట్ హాట్గా సాగింది. సభ మొత్తం హాట్ హాట్ గా సాగుతున్న సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా... ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలకృష్ణ తో సభ అంతా హాట్ హాట్ గా సాగుతున్న సమయంలోనే శాసనమండలిలో లాబీలో  కూర్చుని సెల్ఫీ దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 

 అయితే గతంలో రోజా హీరోయిన్ గా ఉన్న సమయంలో నందమూరి బాలకృష్ణతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సంచలన విజయాలను కూడా నమోదు చేస్తాయి. అయితే రోజా కు  ఒకప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయా... లేక ప్రస్తుతం బాలకృష్ణ సరికొత్త లుక్  నచ్చిందా అన్న విషయం పక్కన పెడితే ప్రస్తుతం శాసనమండలిలో బాలకృష్ణ రోజా దిగిన సెల్ఫీ మాత్రం వైరల్ అయిపోయింది. తాజాగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న బాలకృష్ణ రోజా సెల్ఫీ కి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ... ఏమన్నారంటే.?  

 

 

 వావ్... రోజా గారు... హీరోల కనిపిస్తున్నారు. ఎవరో పక్కన ఉన్నారు కానీ...నాకు తెలియదు. చూసేందుకు.. యాక్.. అనేలా కనిపిస్తున్నాడు. రోజా అందాన్ని తన ముఖంతో ఆయన చెడగొడుతున్నారు. బహుశా అతను రోజాకి దిష్టిబొమ్మనేమో అంటూ వర్మ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలో అందంగా ఉన్న రోజా పక్కన ఉన్నది ఎవరో చెప్పగలరా అంటూ  నెటిజన్లను ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ పై సంచలన కామెంట్స్ చేసిన ఎన్నో సార్లు దుమారం రేపిన వర్మ మరోసారి నందమూరి బాలకృష్ణ పై కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: