నటులకి విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఒకే తరహా పాత్రలు చేసుకుంటూ వెళ్తే ప్రేక్షకులకే కాదు నటుడిగా కూడా బోరు కొట్టేస్తుంది. అయితే స్టార్ హీరోలు దాదాపుగా ఒకే తరహా క్యారెక్టర్లు చేస్తుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే విభిన్నమైన పాత్రల్లో కనిపించి తమలోని నటుడిని సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. అలా విభిన్నమైన సినిమాల్లో నటించిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు.

 

అతడు మొదలుకుని మహేష్ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. అతడులో ఎంత సైలెంట్ గా కనిపించాడో పోకిరి లో అంత మాస్ గా కనిపించాడు. ఇక ఖలేజాకి వచ్చేసరికి ఒక కొత్త మహేష్ ని చూశాం. వన్ నేనొక్కడినే.... స్పైడర్ లాంటి సినిమాలు సూపర్ స్టార్ రేంజ్ హీరోలు తీయడం చాలా కష్టం. కానీ అలాంటి సాహసాలు చేయగలిగాడు మహేష్. అయితే గత కొన్ని రోజులుగా ఒకే తరహా పాత్రలకే స్టిక్ అవుతున్నాడనే వాదన కూడా ఉంది.

 

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని మహేష్ రోల్ కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ ఈ సినిమాలో స్పై పాత్రలో నటించబోతున్నారట. అయితే మహేష్ బాబు ఇప్పటికే ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన స్పైడ‌ర్ సినిమాలో స్పై రోల్ లో న‌టించినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

 

అయినప్పటికీ మహేష్ బాబు మళ్లీ ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న సినిమాలో కూడా అలాంటి స్పై పాత్రలోనే నటించాలనుకోవడం నిజంగా విశేషమే. ఏప్రిల్ నెల‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.  మరి మరోసారి ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ పాత్ర జనాలకి నచ్చుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: