నాచురల్ స్టార్ నాని ఓన్ టాలెంట్ తో హీరోగా ఎదిగిన వారిలో అతని పేరు కూడా ఉంటుంది. అష్టా చమ్మ సినిమా నుండి జెర్సీ వరకు సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నాని. ప్రస్తుతం తనని హీరోగా చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో నానితో పాటుగా సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి నాని తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

 

ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత నాని మరోసారి టాలెంటెడ్ డైరక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిన్ను కోరి సినిమాతో తనకు హిట్ ఇచ్చిన శివ నిర్వాణ డైరక్షన్ లో నాని సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదేకాదు టాక్సీవాలా సినిమాతో తన ప్రతిభ చాటుకున్న రాహుల్ సంకృత్యన్ తో కూడా నాని ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది.  శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టక్ జగదీష్ అనే టైటిల్ పెట్టారు.

 

ఈమధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన ఆ సినిమా షూటింగ్ కూడా ఓ పక్క శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కెరియర్ పరంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్న నాని వి, టక్ జగదీష్ సినిమాలతో మరోసారి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరించాలని చూస్తున్నాడు. మరి ఈ రెండే కాదు రాహుల్ సంకృత్యన్ తో చేసే సినిమా మీద కూడా తక్కువ అంచనా వేయలేమని అంటున్నారు సిని విశ్లేషకులు. 2020 నాని కనీసం రెండు సినిమాలతో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాడు. ఎలాగు కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తాడు కాబట్టి నాని ఈ ఇయర్ కూడా హిట్ మేనియా కొనసాగించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: