స్టార్ హీరోల సినిమాలు హిట్టయితే ఆ హిట్ తాలూఖా బాధ్యత మరింత భారంగా ఉంటుంది. ఒక సినిమా హిట్టు కొట్టామని కాలర్ ఎగురవేస్తే సరిపోదు ఆ తర్వాత సినిమా మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. 2020 సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సూపర్ హిట్ అవగా.. మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా దుమ్ముదులిపేసింది. ఈ సినిమాల ఫలితాలపై ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సూపర్ జోష్ లో ఉన్నారు.

 

ఇక ఇదిలాఉంటే మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక బన్ని మాత్రం సుకుమార్ తో సినిమా లైన్ లో పెట్టాడు. అయితే కొన్నాళ్లుగా అల్లు అర్జున్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు డైరక్టర్ వి.ఐ.ఆనంద్. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న ఆయన అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమా చేశాడు. ఆ సినిమా నిరాశ పరచినా అతని వర్కింగ్ స్టైల్ కు బన్ని తనకో ఛాన్స్ ఇస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. బన్నికి తగిన ఓ కథ కూడా రాసుకున్నాడట వి.ఐ.ఆనంద్.

 

ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో డిస్కో రాజా సినిమా చేశాడు వి.ఐ.ఆనంద్. రేపు అనగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో ఎలాగైఆ హిట్టు కొట్టి బన్నిని మెప్పించాలని చూస్తున్నాడు డైరక్టర్ వి.ఐ.ఆనంద్. అయితే రవితేజ సినిమా హిట్టు పడితే మాత్రం బన్ని ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా సరే మిగతా హీరోలు మాత్రం వి.ఐ.ఆనంద్ తో పనిచేసే అవకాశం ఉంది. రవితేజ కూడా వి.ఐ ఆనంద్ హార్డ్ వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అందుకే డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హిట్టయితే ఈ సినిమాకు సీక్వల్ కాని ప్రీక్వల్ కాని ఉంటుందని నమ్మకంగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: