టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత అల్ల‌అర‌వింద్ కొడుకు అల్లుఅర్జున్. తండ్రి పేరు చెప్పుకుని ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా కూడా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు అల్లుఅర్జున్‌. అద్భుతమైన న‌ట‌న‌, ప్ర‌త్యేక‌మైన డాన్సుల‌తో స్టైలిష్ స్టార్ అని పేరు సంపాదించుకున్నారు. గంగోత్రి చిత్రంతో కెరియ‌ర్ ను మొద‌లు పెట్టిన ఆయ‌న ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లును కొల్ల‌గొట్టాయి. 

 

మొద‌టి చిత్రం అల్లుఅర్జున్ గంగోత్రి కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ చిత్రంలో ఆయ‌న న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే లేడీ గెట‌ప్ వేసిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కే ద‌క్కింది. ఇక త‌ర్వాత రెండ‌వ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌కత్తంలో ఆర్య. అందులో అనూమెహ‌తాతో జంట‌గా న‌టించారు. ఆ చిత్రంలో ఓ చిత్ర‌మైన ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. ఆ చిత్రం 18కోట్ల‌కు పైగా బాక్సాఫీస్ ముందు లాభాల‌ను ద‌క్కించుకుంది.

 

వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చిత్రంలో న‌టించారు. మాస్ & లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు ఈసారి ఏకంగా 30 కోట్ల క‌లెక్ష‌న్లు సంపాదించింది. ఈ చిత్రానికి నంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డు కూడా ద‌క్కించుకుంది. హ్యాపీ - ఈ సినిమా అనుకున్నంతగా లాభాలని అందించకపోయినప్పటికీ బన్నీలోని కామెడీ యాంగిల్ ని భయట‌పెట్టింది. ఒక్కో చిత్రానికి ఒక్కో ర‌క‌మైన వేరియేష‌న్ చూపిస్తూ బ‌న్నీ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తూ వ‌చ్చారు. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన దేశ‌ముదురు చిత్రం అద్భుత‌మైన క‌లెక్ష‌న్లు ద‌క్కించుకోవ‌డ‌మేకాక హ‌న్నికతో సాగే రొమాంటిక్ యాంగిల్ మాస్ పీపుల్‌ను బాగా ఆక‌ట్టుకుంది. ఆచిత్రానికి బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డుకు ద‌క్కించుకుంది. వేదం - ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించ‌లేక‌పోయినా... అల్లు అర్జున్ నటనకు మంచి పేరు వ‌చ్చింది. ఈ చిత్రం కోసం అల్లుఅర్జున్ రెమ్యూన‌రేష‌న్ కూడా చాలాత‌క్కువ‌గా తీసుకున్నారు.

 

 త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి చిత్రంతో స‌డెన్‌గా ఆయ‌న ఇమేజ్ మారిపోయింది.  బన్నీ తనకు కూడా 50కోట్లకు పైగా మార్కెట్ ఉందని ఈచిత్రం ద్వారా నిరూపించుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రేసుగుర్రం చిత్రంతో అల్లు అర్జున్ తనలోని యాక్షన్ మ‌రియు కామెడీ టైమింగ్ క‌రెక్ట్‌గా అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు 50 కోట్లు దాకా లాభాల‌ను అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన త‌న  రెండవ చిత్రం స‌న్నాఫ్‌స‌త్య‌మూర్తి. ఈ సినిమాలో బన్నీ తనలో పర్ఫెక్ట్ ఎమోషనల్ యాక్టర్ ఎమోష‌న్స్‌ను చూపిస్తూ  ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకున్నాడు. ఈచిత్రం దాదాపు 90కోట్లు దాకా ద‌క్కించుకుంది. 

 

బోయపాటి డైరెక్ట్ చేసిన స‌రైనోడులో మంచి యాక్ష‌న్స్ సీక్వెన్స్‌లో సరైన చిత్రంగా ఆయ‌న‌కు నిలిచింది.  ఈ సినిమా 100కోట్ల బాక్స్ ఆఫీస్ ;కలెక్షన్స్ తో బన్నీకి ఒక బ్రాండ్ ని సెట్ చేసింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన డీజే ఈ చిత్రంతో సంప్ర‌దాయ‌మైన బ్రాహ్మ‌ణ కుటుంబంలోకొడుకు పాత్ర‌లో... మ‌ళ్ళీ డాన్ పాత్ర‌లో ఇలా రెండు వేరియేష‌న్స్‌ని చూపించారు.  రెండు పాత్ర‌ల్లోనూ అద్భుతంగా న‌టించారు. ఈ చిత్రం మంచి హిట్ అయింద‌నే చెప్పాలి.  ఇక త్రివిక్ర‌మ్‌తో క‌లిసి మూడ‌వసారి ముచ్చ‌ట‌గా అల‌వైకుంఠ‌పురంలో న‌టించారు. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా  ఇప్పటికే 220కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం క‌థాప‌రంగా పెద్ద‌గా చెప్పుకోవ‌డానికి ఏమీ లేక‌పోయినా ఆడియో హిట్ అయింది. దాంతో కాస్త ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని పండించ‌డంలో త్రివిక్ర‌మ్ దిట్ట అన్న విష‌యం తెలిసిందే. వాట‌న్నిటిని క్యారీ చేస్తూ అల్లుఅర్జున్ న‌ట‌న‌, అద్భుత‌మైన డాన్స్‌తో ఈచిత్రం ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించింద‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: