టాలీవుడ్ యంగ్ హీరో బ్యాచిలర్ లైఫ్ గుడ్ బాయ్ చెప్పి త్వరలో పెళ్ళి చేసుకోబుతున్నాడు. నితిన్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్. కానీ అమ్మాయిలకు మాత్రం షాక్ అని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిల్లో నితిన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఓవైపు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నితిన్ త్వరలో ఓ ఇంటివాడయ్యేందుకు రెడీ అయ్యాడు. కొంతకాలంగా నితిన్ .. షాలిని అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసిన  తనని తమ పెద్ద వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఇరు వైపులా పెద్దలు డెస్టినేషనేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని తాజా సమాచారం. కొద్దిమంది సన్నిహితులు బంధు మిత్రుల సమక్షంలో దుబాయ్ లో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ లో పెళ్లి కి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారట. అతి త్వరలోనే నిశ్చయతాంబూలానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అదే రోజును పెళ్ళి డేట్ ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత జరగాల్సిన ప్లాన్స్ ఇప్పటికే సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించనున్నారు. అలాగే నితిన్ పరిశ్రమ లో తనకు బాగా క్లోజ్ గా ఉండే స్నేహితులకు గ్రాండ్ గా ఓ పార్టీ ఇవ్వనున్నాడుట. ప్రస్తుతం నితిన్ పెళ్లి కి సంబంధించిన పనులన్నింటిని నితిన్ అక్క.. యువనిర్మాత నిఖితా రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా నితిన్ పెళ్ళికి తనకి బాగా ఇష్టమైన దర్శకులు త్రివిక్రం శ్రీనివాస్, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరవుతాని తెలుస్తోంది.

 

ఇక నితిన్ ప్రస్తుతం ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. అన్ని పనులు పూర్తిచేసి ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలస్యం అయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఫిక్సయిన తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారట. ఇక త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ గా చేయనున్నారట. ఇందులో నితిన్ కు జోడీగా కన్నడ బ్యూటి రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా ఇంకా రెండు మూడు సినిమాలు పూర్తి చేయాలి నితిన్. అయితే పెళ్ళి ఉన్న నేపత్యం లో ఆ ప్రాజెక్ట్స్ కాస్ట డిలే అవనున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: