తెలుగు సినీ ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన మహానటులు నందమూరి తారక రామారావు.. అందరూ ఎన్టీఆర్ గా పిలుచుకుంటారు.  సాధారణంగా కొంత మంది నటులు కొన్ని పాత్రలకే పరిమితమవుతారు.. కానీ ఎన్టీఆర్ ఏ పాత్రకైనా జీవం పోస్తారని అంటారు.  సాంఘిక, పౌరాణిక, జానపద పాత్రలు ఏవైనా ఆ పాత్రకే వన్నె తెచ్చే గొప్ప నటులు ఎన్టీఆర్.  తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 సినిమాల్లో నటించారు.   విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ సినిమాలంటే అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసేవి ఉండేవి. వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

 

తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక,  44 పౌరాణిక సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ చిన్నతనం నుంచి నాటకాలంటే వల్లమాలిన అభిమానం.  ఆయన కాలేజీ రోజుల్లో ఓ నాటక సంస్థ కూడా ఏర్పాటు చేశారు.  రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

 

ఇదే సమయంలో ఎన్టీఆర్ ‘మనదేశం’ మూవీలో నటించారు. ఈ మూవీ 1948 లో రిలీజ్ అయ్యింది.. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా చాలా కఠినంగా కనిపిస్తారు ఎన్టీఆర్.  వాస్తవానికి ఈ మూవీ కన్నా ముందు  ఎన్టీఆర్ కు వింధ్యరాణి అనే సినిమా చేసే అవకాశం వచ్చింది.  సి పుల్లయ్య ఆ సినిమాకు దర్శకుడు.. ఎన్టీఆర్ ని స్వయంగా కలిసి వేషం వేయాలని కోరినా.. ఆయన మాత్రం డిగ్రీ పూర్తి చేయకుండా సినిమా చేయబోనని ఖచ్చితంగా చెప్పేశారట.  డిగ్రీ పూర్తయ్యాక అయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: