బాలీవుడ్ సినిమా పరిశ్రమకు తన తండ్రి శక్తి కపూర్ నట వారసత్వంతో హీరోయిన్ గా అడుగుపెట్టిన నటి శ్రద్ధ కపూర్. అయితే హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ఆషికి 2 తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన శ్రద్ధ, ఆ సినిమాలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఇక అక్కడి నుండి ఆమెకు అవకాశాలు బాగానే రాసాగాయి. అయితే వచ్చిన అవకాశాలను చాలావరకు మంచి సక్సెస్ లు గా మలుచుకుంటున్న శ్రద్ధ కపూర్, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ని కూడా ఎదుర్కొన్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి సౌత్ ప్రేక్షకుల మదిని కూడా గెలుచుకున్న శ్రద్ధ, 

 

ఇప్పుడు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. ఆమె డేట్స్ కోసం ఎందరో అక్కడి బడా నిర్మాతలు ఎగబడుతున్నారంటే, శ్రద్ధ కు ఉన్న క్రేజ్, మార్కెట్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే ఎప్పుడూ కొంత సైలెంట్ గా ఉండే శ్రద్ధ, కేవలం సినిమా ఫంక్షన్స్ లో మాత్రమే మాట్లాడుతుంటారు, అది కూడా అవసరం అయిన మేరకు మాత్రమే. అయితే ఆమె కెరీర్ బిగినింగ్ నుండి కూడా ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ తో ఒకింత చనువుగా ఉన్నట్లు అనేకమందికి తెలిసిన విషయం. అయితే నిజానికి వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమో, లేక స్నేహమో ఇప్పటికీ ఆమె సన్నిహితులకు కూడా తెలియదట. 

 

ఇక అతి త్వరలో రోహన్ ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లుగా కూడా ఇటీవల కొన్ని బాలీవుడ్ మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేయగా, అటువంటిది ఏమి లేదని ఆమె తండ్రి శక్తి కపూర్ వాటిని కొట్టిపారేశారు. అయితే మళ్ళి చాలారోజుల తరువాత శ్రద్ధ పెళ్లిపై నిన్న బాలీవుడ్ లో తీవ్ర చర్చ మొదలైంది. ఆమె నిజంగానే రోహన్ ని ఈ ఏడాదే వివాహం చేసుకోనున్నారని, అతి త్వరలో ఆ విషయాన్ని స్వయంగా శ్రద్ధ నే వెల్లడించనున్నారు అనేది ఆ వార్త యొక్క సారాంశం. అయితే వాటిపై నేడు ఘాటుగా స్పందించిన శ్రద్ధా, తనకు ప్రస్తుతం దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, తన పెళ్లి విషయమై వస్తున్న వార్తలన్నీ కూడా ఒట్టి పుకార్లేనని వాటిని ఆమె కొట్టిపారేశారు. దీనితో శ్రద్ధ పెళ్లి పై వచ్చిన పుకార్లన్నిటికీ కూడా అడ్డు కట్ట పడింది....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: