యంగ్ హీరోలు వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ ఛాలెంజ్ గా తీసుకున్నారు. సిినిమానే అయినా ఈ కుర్రహీరోలు ప్రొఫెషనల్ గా తీసుకున్నారు. న్యూ మూవీ కోసం వరుణ్, విజయ్ లు స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నారు. స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ యంగ్ హీరోలు బిగ్ స్క్రీన్ మీద ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్స్ ని మరిపించేలా ఉన్నారు. 

 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. విజయ్ ఈ  సినిమాలో కిక్ బాక్సర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించేందుకు విజయ్ ఏకంగా 10మంది విదేశీ కోచ్ ల సమక్షంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడట. మరోవైపు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్న వరుణ్ తేజ్ సైతం స్పెషలిస్ట్ కోచ్ ని సెట్ చేసుకొని ఏకంగా ప్రొఫెషనల్ బాక్సర్ గా మారేందుకు ట్రై చేస్తున్నాడట. 

 

సినిమా కోసమే అయినా ఈ యంగ్ హీరోలు ఇద్దరు ఛాలెంజింగ్ గా శిక్షణ తీసుకోవడం విశేషం. విజయ్ దేవరకొండ 40రోజుల పాటు థాయ్ లాండ్ కు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు వద్ద శిక్షణ తీసుకన్నాడట. ఇప్పుడు వరుణ్ తేజ్ ఏకంగా ఇండియాస్ ది బెస్ట్ బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. అలాంటి స్పెషలిస్ట్ సమక్షంలో వరుణ్ బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకుంటున్నాడంటే సినిమాలో ఆ ఎఫర్ట్ కనిపిస్తోందనే చెప్పాలి. 

 

వరుణ్ తేజ్ గద్దల కొండ గణేశ్ చిత్రం టైమ్ లో హాలీవుడ్ బాక్సర్ టోనీ జెఫ్రీ వద్ద శిక్షణ పొందాడు. ఇప్పుడు ఇండియా బాక్సింగ్ ర్యాంకర్ నీరజ్ వద్ద నెల రోజుల పాటు శిక్షణ పొందుతున్నాడట. బాక్సింగ్ లో టెక్నిక్స్ తెలుసుకున్నా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లారెన్ స్టోవల్ వర్క్ చేస్తున్నాడు. ఇంతకు ఈయన సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించాడు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: