టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  నటన, డ్యాన్స్, ఫైట్స్, కామెడీ ఏదైనా తనదైన స్టైల్లో అభిమానుల మనసు దోచేస్తున్నాడు.. అందుకే ఫ్యాన్స్ అతన్ని స్టైలిష్ స్టార్ అంటారు.  సరైనోడు, దువ్వాడ జగన్నాథం హిట్స్ తర్వాత ‘నా పేరు సూర్య’ మూవీతో దారుణమైన ఫ్లాప్ అందుకున్నాడు బన్ని.  దాంతో మంచి కథ కోసం ఏకంగా రెండేళ్లు సమయం తీసుకున్నాడు. ఇక జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నే నమ్ముకున్నాడు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ మూవీ వచ్చింది. 

 

రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అయితే ‘అల వైకుంఠపురములో' సినిమాలో చూపించిన 'వైకుంఠపురం' ఇల్లు నిజ జీవితం లో ఒక మీడియా అధినేత బంధువులది. ఎప్పుడైతే ఈ ఇంటిని చూసి అల్లు అర్జున్ ఫిదా అయ్యారట.. అంతే కాదు కడితే ఇలాంటి ఇళ్లే.. కట్టాలని భావించారట. అనుకున్నదే తడవు అప్పడే రంగంలోకి దిగిపోయినట్లు సమాచారం. హైదరాబాద్ లో ఇంటిని డిజైన్ చేసే బాధ్యతను ప్రముఖ ఆర్కిటెక్ట్ కు అప్పగించారట. నాన్నగారు అల్లు అరవింద్ కు సంబంధించిన స్థలం లో ఈ ఇంటి నిర్మాణం చేపడతారని సమాచారం.

 

ఈ ఇంటిని అన్ని వసతులతో పాటుగా ఆధునిక సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ ఇంట్లోకి వస్తే.. నిజంగానే మనం స్వర్గంలోకి వచ్చామా అన్న రీతిలో కనిపించేలా స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్నారట అల్లు అర్జున్.  నిజమే కలలు అందరూ కంటారు.. కానీ కొంత మందే ఆ కలలు నెరవేర్చుకుంటారు.  బన్ని తన కెరీర్ లో ది బెస్ట్ హౌజ్ గా ప్లాన్ చేయడం అభిమానులకు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: