ఇండియాలో క్రికెట్ అంటే ఓ మతం అనే మాట ఉంది. క్రికెట్ అను అలా ప్రతి భారతీయుడికీ దగ్గర చేసింది ఒకే ఘట్టం. అదే.. 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం. ఆ సంఘటన భారతీయ క్రికెట్ గతినే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ సిరీస్ లో కపిల్ దేవ్ ప్రదర్శన కూడా ఓ చరిత్ర. ఇప్పుడా చరిత్రనే బాలీవుడ్ సినిమాగా తీస్తూండడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడీ సినిమాను తెలుగులో మన కింగ్ నాగార్జున విడుదల చేస్తూండడం మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

 

 

ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించాడు. ‘భారత క్రికెట్లో 1983 మరచిపోలేనిది. ఆ ఏడాది ఇండియా తొలి వరల్డ్ కప్ నెగ్గింది. ఇప్పటికీ ఆ విజయం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో తెలిపాడు. బాలీవుడ్ లో 83 పేరుతో ఇండియా వరల్డ్ కప్ నెగ్గిన మధుర జ్ఞాపకాన్ని సినిమా తెరకెక్కిస్తున్నారు. కపిల్ దేవ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు కబీర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రణబీర్ కపూర్ నటరాజ్ షాట్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

 

 

క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఏ సినిమాకైనా భారత్ లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. చాలా సినిమాలు హిట్ అయ్యాయి కూడా. కానీ వరల్డ్ కప్ నేపథ్యాన్ని మాత్రం ఇంతవరకూ ఎవరూ తెరకెక్కించలేదు. దీంతో ఈ సినిమా ప్రతి క్రికెట్ అభిమానికి స్పెషల్ మూవీ కానుంది. రిలయన్స్, ఏషియన్ మూవీస్ తో సంయుక్తంగా నాగార్జున ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: