ఆయన ఒక హస్యనటుడు. ఎంతటి హస్య నటుడంటే, పూర్వకాలంలో విదూషకుడు అనే ఒక హస్యచతురత కలిగిన మహానుభావుడు ఉండేవారని మనం చదివాం. అతన్ని మించిపోయిన నటుడు. ఇప్పుడు మన టాలీవుడ్‌లో ఉన్నారు. ఆయన నవ్వినా, ఏడ్చివినా, కౄరంగా డైలాగులు చెప్పిన చూసేవారికి నవ్వు వస్తుందే తప్పితే కించిత్తైన కన్నీళ్లు రావు. ఆయన ఏ పాత్రచేసిన అందులో హస్యం ఉంటుందే తప్పా, రౌద్రం ఉండదు.

 

 

ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ వేసినా అందులో కూడా నవ్వులు పువ్వులై పరిమళిస్తాయి గాని సీరియస్ నటన కనబడదు. ఈ హస్య బ్రహ్మను చూస్తే, చావలనుకున్న వాడి ముఖంలోని చావుకళను కూడా తప్పిస్తాడు.. ఇక ఆయన ఏం చేసినా నవ్వే వస్తుంది. చివరికి ఆయన విలన్‌గా నటించాలనుకున్న నవ్వే వస్తుంది, డాన్స్‌ చేసినా నవ్వే వస్తుంది. ఇలా ఇప్పటి వరకు ఆయన కన్నీళ్లు వచ్చేలా నవ్వించాడే తప్పా, ఎప్పుడు కన్నీరు పెట్టించేలా నటించలేదు. ఇంతకు ఇంతలా చెబుతున్న ఆ అపర హస్య శక్తులు కలిగిన నటుడు ఎవరని ఆలోచిస్తున్నారా.. అతడే  బ్రహ్మానందం.. తానుంటే హస్యానికే అందం వస్తుంది.

 

 

ఇక ఇప్పటి వరకు నవ్వు, నవ్వించు, నవ్వులు పండించు అంటూ సినీ ప్రపంచంలో తన అద్భుత నటన ద్వారా తాను నవ్వకుండా ఇతరులను నవ్వించి, తాను ఏడవకుండా ప్రేక్షకులను తన నటన ద్వారా ఏడ్పిస్తూ ఆ ఏడ్పులోనే హాస్య రసాన్ని మేళవిస్తూ తెలుగు కళామ తల్లికి ఎనలేని సేవలు అందించాడు. ఇలాంటి నటుడు ఇప్పుడు ప్రేక్షకుల్ని ఏడిపించడానికి రెడీ అవుతున్నాడట. అది కూడా ఎమోషనల్‌గా కన్నీరు పెట్టించేందుకు రాబోతున్నాడట. ఇంతకు ఎందులో అనే కదా మీ డౌట్.. ఆ చిత్రం పేరు రంగమార్తాండ..

 

 

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.. ఇప్పటి వరకు చూసిన బ్రహ్మానందంలా, కాకుండా విభిన్నమైన బ్రహ్మానందంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడని ఫస్ట్‌లుక్‌తోనే అర్థం అవుతుంది. ఇంతకాలం నవ్విస్తూ కన్నీళ్లు పెట్తించిన ఈ నవ్వుల బ్రహ్మ ఇప్పుడు రంగమార్తాండ చిత్రంలో కనిపించే ప్రతి సీన్స్‌ లో  ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తాడట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు... మరి ఇంతకాలం బ్రహ్మాన్ని చూసి హాయిగా నవ్వుకున్న ప్రేక్షకులు, ఎంతలా ఏడుస్తారేమో తెలియాలంటే ఈ సినిమా విడుదల అయ్యేదాకా ఆగవలిసిందే..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: