తెలుగు యువ కథానాయకుడు నందు, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ‘సవారి’. ‘బందంరేగడ్’ షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సాహిత్ మోత్కూరి ఈ చిత్రాని కి దర్శకత్వం వహించారు. కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

 

బాద్‌షా అనే గుర్రం, దాని యజమాని రాజు చుట్టూ తిరిగే కథతో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.ఈ సినిమాలో నందు ఆదిలాబాద్ వాసిగా నటించనున్నారు. గుర్రం స్వారీ చేస్తున్న వ్యక్తి పాత్రలో ఈయన నటిస్తున్నారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నందు పక్కా తెలంగాణ కుర్రాడి పాత్రలో నటించారు. 


ఇకపోతే ఈ సినిమా లో నందు మేనరిజం, గెటప్ చాలా కొత్తగా ఉన్నాయి. డ్రాయర్‌ లో బోల్డ్‌గా కనిపించారు. ఈ సినిమాలో బోల్డ్ కామెడీ తో పాటు ఎమోషనల్ కంటెంట్, లవ్ కూడా ఉన్నాయి.ఈ సినిమా ట్రైలర్ గురించి నందు భార్య, గాయని గీతామాధురి సోషల్ మీడియాలో స్పందించారు. ట్రైలర్‌ లో భర్తను డ్రాయర్‌ లో చూసి ఆశ్చర్యపోయారు. ట్రైలర్ చూస్తూ నోరెళ్లబెట్టారు. నందు ఇలా నటించారని నేను అనుకోలేదు అంటూ ఆమె ఆశ్చర్యానికి గురైంది. మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి.. 

 

గీత మాట్లాడుతూ.. వామ్మో’’ అని ట్రైలర్ లింక్‌ను ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేశారు. అంతే కాదు, ఆమె ల్యాప్‌టాప్‌లో ట్రైలర్ చూస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. కాగా, ఈ సినిమా కు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. మోనిస్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ అందించారు. నందు ఇలా నటించారని నేను అనుకోలేదు అంటూ ఆమె ఆశ్చర్యానికి గురైంది. మరి సినిమా ఏ రేంజులో ఉంటుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: