వైవిధ్యమైన కథల్లో నటించాలని చాలామంది హీరోలు ట్రై చేస్తుంటారు. కానీ అలాంటి సబ్జెక్ట్స్ క్యాచ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అయితే ఆయుష్ మాన్ ఖురానా మాత్రం ఈ విద్యలో ఆరితేరాడు. విభిన్నమైన కథలతో సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. బాలీవుడ్  లో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకుంటాడు. 


ఆయుష్  మాన్ ఖురానా ఇమేజ్ తో  సంబంధం లేకుండా జర్నీ చేస్తున్నాడు. కమర్షియల్, కామెడీ, యాక్షన్ ఇలా రెగ్యులర్ జానర్స్ కాకుండా కొత్తకొత్త కథలని టచ్ చేస్తున్నాడు. ఫస్ట్ మూవీ విక్కీ డోనర్ లో స్పెర్మ్ డోనర్ గా నటించి ఆయుష్ మాన్, సినిమా సినిమాకో కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. 

 

అంధాదున్ లో అంధుడిగా నటించి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్ మాన్, సినిమాలన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేకుండానే ఉంటున్నాయి. ఒక సినిమాలో ఆర్టికల్  15గురించి మాట్లాడితే మరొకదాంట్లో బట్టతల సమస్యలని ప్రస్తావిస్తాడు. ఒక్కదగ్గర స్పెర్మ్ డోనర్ గా కనిపిస్తే మరోచోట స్వలింగసంపర్కానికి సంబంధించిన కథతో వస్తాడు. 

 

ఆయుష్ మాన్ ఖురానా ఇపుడు శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఆయుష్ మాన్ గే పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ఆయుష్ మాన్ ఘట్స్ ఉన్న హీరో అనే కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. బాలీవుడ్ స్టార్లు కూడా ఈ హీరో సెలక్షన్ కు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఖురానా బాలీవుడ్ లో స్పెషల్ గా నిలుస్తాడని చెబుతున్నారు. మొత్తానికి ఆయుష్ మాన్ ఖురానా వైవిధ్యభరితమైన చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక థీమ్ తో వస్తుందనేది ప్రేక్షకులకు ఆల్ రెడీ తెలిసిపోతుంది. అందుకే ఈ హీరో సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ లో ఈయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: