తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంతగా ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కోసం తెలుగు ప్రేక్షకుల సాయంత్రం కాగానే  టివిల ముందు సిద్దంగా కూర్చుంటారు. ఇప్పటికీ జబర్ధస్త్ ప్రారంభమై ఏడేళ్లు అవుతున్నా.. ప్రతిరోజూ కొత్త కొత్త స్కిట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.  జబర్ధస్త్ పుణ్యమా అని ఇప్పుడు కొంత మంది సీనియర్లు సినిమాల్లో కూడా తమ జోష్ చూపిస్తున్నారు.

 

 జబర్ధస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది.. హైపర్ ఆది. ఇక హైపర్ ఆది స్కిట్స్ వస్తుందీ అంటే చాలు కడుపు పొట్టచెక్కలు కావాల్సిందే.. మనోడే వేసే సెటైర్ పంచ్ లు బాగా పెలుతాయి.  చాలా హ్యూమర్ గా ఉండే ఆయన మేనరీజం ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది.  ప్రస్తుతం బుల్లితెరపైనే కాదు.. వెండి తెరపై కూడా మనోడికి వరుసగా ఛాన్సులు వస్తున్నాయి.  అయితే హైపర్ ఆది పంచ్ లలో కొన్ని ద్వందర్థాలు ఉంటున్నాయని ఈ మద్య ఎన్నో కామెంట్స్ వినిపించాయి.. కానీ అవి ఏవీ మనోడి కామెడీ ముందు నిలబడ లేకపోతున్నాయి.   

 

నేడు ఎమ్ఎస్ నారాయణ వర్ధంతి. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయనకు నివాళ్లు అర్పించారు. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ మీడియా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎమ్ఎస్ నారాయణకు నివాళ్లు అర్పిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దానిని చూసినా హైపర్ ఆది వెంటనే ఆ పోస్ట్ ను షేర్ చేశాడు. అయితే ఇక్కడే మనోడు తప్పులో కాలేశాడు. ఎక్కడా దొరకని హైపర్ ఆది ఇక్కడ అడ్డంగా బుక్ అయ్యాడు. వర్ధంతి రోజని తెలిసి పెట్టాడో లేక తెలియాక పెట్టాడో కానీ హ్యాపీ బర్త్ డే సర్ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు హైపర్ ఆదిని ఏకిపడేస్తున్నారు. మొత్తానికి పోస్ట్ పెట్టిన రెండు గంటల తరువాత తప్పు తెలుసుకున్న ఆది పోస్ట్ డిలీట్ చేశాడు.కానీ అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. దాదాపు 600లకు పైగా లైక్స్, కామెంట్స్ వచ్చేశాయి. మరో వైపు స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ గా మారిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: