గ్యాప్ తీసుకోలేదు... గ్యాప్ వచ్చింది. అల వైకుంఠపురములో ఈ డైలాగ్ రవితేజకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. మాస్ రాజా సినిమా రిలీజై ఏడాది దాటింది. 2019లో కనిపించని మాస్ మహా రాజా గ్యాప్ తీసుకొని.. డిస్కో రాజాగా ముందుకొస్తున్నాడు. 


హిట్ కావాల్సిన హీరోల్లో రవితేజ ముందున్నాడు. సక్సెస్ చూసి మూడేళ్లయింది. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు. నేల టిక్కెట్.. అమర్ అక్బర్ ఆంటోని లాంటి మూడు సినిమాలు చేస్తే.. ఒక్కటీ హిట్ కాలేదు. దీంతో ఎలాంటి మూవీ చేయాలా.. అని ఆరు నెలల పాటు ఆలోచించి కొత్తదనం కోసం సైంటిఫిక్ థ్రిల్లర్ ఎంచుకున్నాడు. ఇందులో రవితేజ కూడా డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తూ ఆసక్తి పెంచాడు. 


డిస్కో రాజాతో పాయల్ రాజ్ పుత్.. నభా నటేశ్ జత కట్టారు. అల వైకుంఠపురములో.. ప్రతీరోజు పండుగే లాంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తమన్ మ్యూజిక్ అందించాడు. చిన్నవాడా నీకోసంతో డిఫరెంట్ డైరెక్టర్ గా నిరూపించుకున్న వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా తెరకెక్కింది. 

 

మాస్ రాజా రవితేజ మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు. 80..90 దశకంలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన బప్పిలహరితో కలిసి రమ్ పమ్ బమ్ అంటూ హుషారైన గీతానికి స్వరం కలిపాడు రవితేజ. డిస్కోరాజా సినిమా హిట్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 25కోట్లు కలెక్ట్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు బిజినెస్ జరిగింది. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను డిస్కోరాజా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. 

 

మొత్తానికి రవితేజ డిస్కోరాజాతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచేస్తున్నాడు. తన పవర్ ఫుల్ డైలాగ్స్.. ఆకట్టుకునే ఫైటింగ్స్ కాకుండా.. సింగర్ గా కూడా అలరించనున్నాడు. ఎపుడెపుడు డిస్కోరాజా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లో చూసి ఎంజ్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: