ప్రేమ గురించి.. పెళ్లి గురించి ఏ హీరోయిన్నీ అడిగినా ఒకేరకమైన సమాధానం వస్తుంది. లవ్ ఎఫైర్ గురించి శ్రద్ధా కపూర్ ని అడిగితే.. అందరిలాగే స్పందించింది. అక్షరం పొల్లుపోకుండా దించేసింది. 

 

సాహోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ తన పెళ్లి గురించి వస్తున్న వార్తపై పెదవి విప్పింది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్టాతో సన్నిహితంగా ఉంటోంది శ్రద్ధా. ఎంతగా అంటే.. పార్టీలకు, డిన్నర్లకు కలిసి వెళ్తూ మీడియా కళ్లలో పడ్డారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. 2020లో పెళ్లి గ్యారెంటీ అంటూ కథనాలు కూడా వచ్చాయి. 

 

కూతురు పెళ్లి వార్తను ఆ మధ్య తండ్రి శక్తి కపూర్ వ్యతిరేకించగా.. లేటెస్ట్ గా శ్రద్ధాకపూర్ స్పందించింది. ఈ అమ్మడు నటించిన కొత్త సినిమా స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ శుక్రవారం రిలీజవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రద్ధా.. లవ్ ఎఫైర్ పై మాట్లాడాల్సి వచ్చింది. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్ పైనే. పెళ్లి గురించి ఆలోచించే టైమ్ లేదంటూ అందరిలాగే ప్రేమ వార్తను ఖండించింది. 

 

లవ్ ఎఫైర్ మరిచిపోయి.. కెరీర్ పై దృష్టి పెట్టాలనుకున్నా శ్రద్ధా చేతిలో ఒక్క సినిమానే ఉంది. చాలా భాగం షూుటింగ్ పూర్తి చేసున్న భాగి 3 మార్చిలో విడుదల కానుంది. వాట్ నెక్స్ట్ అంటే.. క్వశ్చన్ మార్కే. సాహో ప్లాప్ తర్వాత తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. ఆఫర్స్ అంతంతమాత్రంగా ఉండటంతో.. కెరీర్ గురించి ఆలోచిస్తూ.. లవ్ ఎఫైర్ ను పక్కన పెట్టిందేమో.. మొత్తానికి శ్రద్ధాకపూర్ లవ్ ఎఫైర్ గురించి కుండ బద్దలు కొట్టింది. తన ప్రేమపై వస్తున్న వార్తలను ఇప్పటికే ఆమె ఫ్యామిలీ వ్యతిరేకించగా.. ఇపుడు ఆమె కూడా ఖండించింది. దీంతో లవ్ ఎఫైర్ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. తన టార్గెట్ అంతా సినిమాలపైనే అంటూ చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: