భారత దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన బిజినెస్ మ్యాన్స్ లో రతన్ టాటా కూడా ఒకరనే విషయం తెలిసిందే. ఎన్నో కోట్ల రూపాయలకు అధిపతి అయిన టాటా, పలు మార్లు ఫోర్బ్స్ లో కూడా తన పేరు వచ్చెనంతలా కష్టపడి సంపదను ఆర్జించారు. నిజానికి తనకు కష్టం అనే ఏమిటో బాగా తెలుసునని, అందుకే కష్టపడే వారు అంటే ఎంతో ఇష్టం అని టాటా అంటుంటారు. ఇక ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్న టాటా, నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. తాను యంగ్ గా ఉన్నపుడు దిగిన ఒక ఫోటోని పోస్ట్ చేసిన టాటా, 

 

థ్రో బ్యాక్ థర్స్ డే గా దానికి క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు తన అభిమానులకు పలు విధాలుగా అందుబాటులో ఉండే టాటా, సడన్ గా యంగ్ గా ఉన్న ఫోటోని పోస్ట్ చేయడంతో ముందుగా కొందరు నెటిజన్లు ఈయనెవరో హాలీవుడ్ హీరోలా ఉన్నాడే అనుకుంటూ భ్రమలో పడ్డారు. అయితే ఎట్టకేలకు ఆ ఫొటోలో ఉంది యంగ్ టాటా అని గ్రహించిన నెటిజన్లు, అదరహో అంటూ ఆ ఫోటోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ కళ్లలో మెరుపులు కనిపిస్తున్నాయి అని కొందరు అంటే, 

 

మరికొందరేమో ఏకంగా ఒక హాలీవుడ్ రేంజ్ హీరో కు ఉండవలసిన క్వాలిటీలు మీకు ఉన్నాయి అంటూ కితాబిచ్చారు. అయితే అది తాను లాస్ ఏంజిల్స్ లో ఉన్నపుడు కొన్నేళ్ల క్రితం ఉరకలేసే యువకుడిగా ఉన్నపుడు దిగిన ఫోటో అని చెప్పిన టాటా, దానిని ఈ థర్స్ డే నాడు పోస్ట్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. కాగా టాటా పోస్ట్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుండగా, పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఫోటో పై ఆసక్తికరంగా ట్వీట్స్ చేస్తున్నారు.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: