ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ కమర్షియల్ హిట్ తో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన పూరి నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమాని రీసెంట్ గా మొదలు పెట్టారు పూరి. పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ వల్ల పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫైటర్ కోసం ఇప్పటికే ఒకప్పటి హాట్ హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ లు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు పూరి కి కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయని చెప్పుకుంటున్నారు. 

 

బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఫైటర్ కోసం పూరి కరణ్ జోహర్ తో కలిసి ముంబాయి నేపత్యంలోనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ముంబై లోనే కంప్లీట్ గా పని చేస్తేనే సినిమా వర్కౌట్ అవుతుంది అని కరణ్ జోహార్ సలహా మేరకు సినిమా మొత్తం అక్కడే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొంత భాగం మాత్రం గోవా ..ఇతర లొకేషన్స్ లో తీస్తారని సమాచారం. అయితే బాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా విషయంలో మొత్తంగా ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత అజమాయిషీ నే కనిపిస్తుందని .. పూరి అనవసరంగా ఇరుక్కున్నాడని టాక్ మొదలైంది. 

 

ఎందుకంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్ దగ్గరనుండి... టైటిల్ వరకు అన్ని కరణ్ కనుసైగలలో జరగాల్సిందేనని ఆంక్షకు పెట్టాడట. ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి పూరి జగన్నాధ్ 'ఫైటర్' టైటిల్ కి కనెక్ట్ అవడంతో ఆ టైటిల్ నే ప్రకటించాడు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు ఫైటర్ టైటిల్ ని రివీల్ చెయ్యలేదు. అందుకు కారణం అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని, ఫైటర్ టైటిల్ కరణ్ జోహార్ కి అంతగా నచ్చకపోవడంతో.. మరో టైటిల్ చూడమని అన్నారట.

 

అంతేకాదు ఫైటర్ షూటింగ్ మొత్తం కరణ్ జోహార్ టీం దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తుందట. దీంతో పాటు కరణ్ జోహార్ ఇన్వాల్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు పూరి ఎవరి దగ్గర బెండ్ అయింది లేదు. అసలిలా పూరి బెండ అవడానికి బాలీవుడ్ లో సినిమా తీయాలనుకోవడం ఒక రీజన్ అయితే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకోవడమే దీనంతటికి అసలు కారణమని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. జాన్వీ కాకుండా ఉంటే పూరి ఇలా బుక్కైయ్యోవాడు కాదని అంటున్నారు. ఆలోచిస్తే అదే వాస్తవమనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: