డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన రేంజ్ హిట్ చూసి చాలాకాలం అయింది. వరుసగా సినిమా ఫాపవుతూ వచ్చాయి. నితిన్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రాం, బాలయ్య, తన కొడుకుతో తీసిన సినిమాలన్ని భారీ గా ఫ్లాపయ్యాయి. దాంతో పూరి ఆర్ధికంగాను బాగా దెబ్బ తిన్నాడు. అయినా ఆయంకి సినిమా తప్ప మరే వ్యాపక్మ్ లేదు అందుకే మళ్ళీ సినిమా కతహ రాశాడు. కానీ ఆ కథ ని ఏ హీరో ఒకే చేయడం లేదు. అందరు వింటున్నారు చెప్తాం చేద్దాం అంటున్నారే గాని ఒక్కరు డేట్స్ ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో బాగా ఫ్లాపులతో సతమతమవుతున్న రాం దొరికాడు. దాంతో రాం కి కథ చెప్పడంతో తనకి నచ్చి ఇద్దరు కలిసి సినిమా చేయడానికి డిసైడయ్యారు. అదే ఇస్మార్ట్ శంకర్.

 

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మంచి వసూళ్ళు రాబట్టి పూరికి డబుల్ ఎనర్జీని ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి పని చేసిన హీరో హీరోయిన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇలా అందరికి కంబ్యాక్ మూవీగా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక పూరి బాగా రీచార్జ్ అయి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ .. భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే పూరి అనుకున్నట్టుగా ఈ సినిమాకి ఫైటర్ కాకుండా ఏదైనా యూనివర్సల్ టైటిల్ ని అనుకుంటున్నారట. 'కిక్ బాక్సర్' అన్న పేరుని తాజాగా అనుకున్నట్టునట్టు తెలుస్తోంది. 

 

ఇక పూరి ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన కొడుకు ఆకాష్ పూరి తో సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి పురి కేవలం కథ స్రీన్ ప్లే ని మాత్రమే అందించారు. దర్శకుడిగా కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నాడు. అయితే మెహబూబా సినిమాతో కొడుకుకి ఫ్లాప్ ఇచ్చాడు పూరి. అందుకనే ఈ సారి వేరేవాళ్ళ డైరెక్షన్ లో కొడుకుని నటించప్ చేస్తున్నాడు. అయితే నిర్మాణ భాధ్యలన్ని పూరి ఛార్మీ చూసుకుంటున్నారు. ఇక తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఆకాష్ రొమాంటిక్ సీన్స్ లో అంతగా ఇన్వాల్వ కాలేకపోతున్నాడట.

 

బాగా మొహమాటపడుతున్నాడని కొన్ని రొమాంటిక్ సీన్స్ లో ఎక్కువ టేక్ లు తీసుకుంటున్నాడని అంటున్నారు. మరి వాస్తవంగా ఆకాష్ కి హీరోగా రొమాంటిక్ రెండవ సినిమా. మరి రొమాన్స్ లో కాస్త బెరుకు కంగారు ఉండటం సహజం. పైగా తండ్రి పక్కన ఉంటే రొమాంటిక్స్ సీన్స్ ఎలా చేయగలడు పాపం అని కొందరు అంటున్నారు. ఇక మెహబూబా లాగా ఈ సినిమా కూడా నిరాశపరుస్తుందా లేక హిట్ కొడతడా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: