ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన రాజా ది గ్రేట్ మూవీతో మంచి సక్సెస్ ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ, ఆ తరువాత నటించిన నెల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు మూడింటితో కూడా ఘోర పరాజయాలు అందుకున్నారు. అనంతరం కొంత ఆలోచనలో పడ్డ మాస్ రాజా, చివరకు తదుపరి సినిమాని ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి నిశ్చయించారు. ఇకపోతే వీరిద్దరి కలయికలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా, ఎట్టకేలకు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని నేడు ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాలతో రావడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ ని బట్టి చూస్తే, సినిమాకు ఒకింత మంచి టాక్ వస్తున్నట్లు సమాచారం. 

 

ముందుగా ఈ సినిమాని కూడా మంచి సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్, ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని మంచి ఎంటెర్టైనింగ్ గా నడిపాడట. ఇక ఈ సినిమాలో రవితేజ రోల్ ఎంతో డిఫరెంట్ గా ఉందని, ఇదివరకు ఎప్పుడూ చూడని రవితేజని ఇందులో చూసినట్లు ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక యాక్షన్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ సీన్స్, అలానే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక అదిరిపోయే ట్విస్ట్ తో ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి ఏర్పడుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా కొంత ఆసక్తికరంగా సాగినప్పటికీ మధ్యలో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ మాత్రం ప్రేక్షకుడి కొద్దిగా విసుగు తెప్పిస్తాయని అంటున్నారు. 

 

అయితే ప్రీ క్లైమాక్స్, అలానే క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయని, వాటితో పాటు మధ్యలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతో బాగున్నాయని అంటున్నారు. మంచి విజువల్స్, రెండు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, కామెడీ సీన్స్ వంటివి ఈ సినిమాకి మంచి బలం అని, ఇక ఓవరాల్ గా చెప్పాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని, మొత్తంగా యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే రెండున్నర గంటల రన్ టైం కూడా ఈ సినిమాకు ఒకింత కలిసి వచ్చే అంశం అని తెలుస్తోంది. మరొక కొద్దిగంటల్లో పూర్తి షోలు పడనున్న ఈ సినిమా, ఎంత మేర టాక్ ని సంపాదిస్తుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: