వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ కు ఈ మధ్య వచ్చిన రాజాది గ్రేట్ సినిమా తర్వాత వచ్చిన అన్నీ సినిమాలు రవితేజ పేరుకు గండిపడెలా ఉన్నాయి.. వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అవ్వడంో రవితేజ కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు విఆనంద్ దర్శకత్వం లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలలో రవితేజ. రచ్చ చేస్తున్నాడు..

 

ఆ సినిమానే 'డిస్కో రాజా' .. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది..మాస్ లుక్ తో వచ్చిన ఈ సినిమాలో రవితేజ  ద్వీపాత్రాభినయం లో నటించారు.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ముందెన్నడూ లేని విధంగా రవితేజ నటించడం విశేషం..  ఈ క్రమంలో రవితేజ ఎంపిక చేసుకున్న విభిన్నమైన చిత్రం ‘డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

 

‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

 

డిస్కోరాజా’ సినిమాపై ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇది ఒక డీసెంట్ మూవీ అని, మాస్ మహారాజా ఇరగదీశారని కొంత మంది అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ అని ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ కొత్త అవతారంలో అద్భుతంగా నటించారని, సినిమా మొత్తం ఆయన భుజస్కందాలపై మోసరని కూడా చెబుతున్నారు. వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించారని అంటున్నారు. సునీల్‌కు కూడా మంచి పాత్ర దక్కిందని కొంత మంది ట్వీట్లు చేశారు. క్లైమాక్స్‌లో ఆయన కుమ్మేశారట. విలన్‌గా బాబీ సింహా అదరగొట్టారని అంటున్నారు.

 

తమన్సినిమా లో మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట. మొత్తంగా సినిమా బాగుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కాస్త నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. కొంతమంది రవితేజ మరోసారి నిరాశపరిచారని నిట్టూరుస్తున్నారు. స్టోరీ లైన్ వెరైటీగా ఉన్నా దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో సినిమాను రొటీన్‌గా మార్చేశారని అంటున్నారు. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాకు సైన్స్ ఫిక్షన్ అనే ట్యాగ్ తగిలించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఓవరాల్‌గా రవితేజ హిట్టు కొట్టినట్టే కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడితే  ఆప్పుడే బయటకు వస్తుంది.. ఇంకా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: