రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అడ్రస్ ఎక్కడో కూడా చేస్తున్నాడు థమన్. గ్యాప్ లేకుండా వరుసగా యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్సీందుకుంటున్నాడు. అమ్యేకాదు మ్యూజికల్ గా మంచి హిట్స్ ని ఇస్తున్నాడు. దాంతో ఇప్పుడు అందరికి థమన్ ఫస్ట్ ఛాయిస్ అయిపోయాడు. అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ క్రెడిట్ ను థమన్ దక్కించుకున్న విషయం తెల్సిందే. సక్సెస్ ఈవెంట్స్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ లు ఈ సినిమా సక్సెస్ కు ముఖ్య కారణం సంగీతం. అల కి సంగీతం అందించిన థమన్ కు ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం దక్కుతుంది .. అంటూ ప్రేక్షకుల ముందు ఓపెన్ గా ప్రకటించిన విషయం తెల్సిందే. అంతటి ప్రశంసలు దక్కించుకున్న తర్వాత థమన్ మరింత రెచ్చి పోవడం ఖాయం అంటూ టాక్స్ వినిపించాయి. అలానే థమన్ తెగ రెచ్చిపోతున్నాడు.

 

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్.. మోస్ట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే థమన్ పేరు మాత్రమే వినిపిస్తుంది. థమన్ కి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తమ సినిమాలకు సంగీతం చేయించుకునేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' సినిమాకి థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలి చాలా రోజులైంది. అయితే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనంది అనౌన్స్ చేయలేదు మేకర్స్. 

 

ఇన్నాళ్లు మిగతా సినిమాలతో బిజీగా ఉన్న థమన్ ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు గా చెప్పుకొచ్చాడు. నాని తో థమన్ మొదటి సారి వర్క్ చేయబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మా కొత్త మ్యూజికల్ జర్నీ ప్రారంభం అయ్యింది. కొత్త వారితో సాగుతున్న ఈ ప్రయాణం బాగుందంటూ లవ్ యూ నాని అంటూ ఒక లవ్లీ ఆల్బం ఇస్తానంటూ నానికి ప్రామిస్ చేశాడు థమన్. ఇక ఇప్పటివరకు శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ సినిమాలకి గోపీ సుందర్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: