అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించడమే తన ధ్యేయం అంటూ దీనికోసం ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతాపార్టీ అధినాయకత్వాన్ని కలిసిన తరువాత పవన్ ఒక మీడియా సంస్థతో మాట్లాడిన మాటలు చాల మందికి షాక్ ఇస్తున్నాయి. అంతేకాదు పవన్ ఈ విషయమై ఊహించని యూటర్న్ తీసుకున్నాడా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఢిల్లీ వెళ్ళే వరకు విశాఖపట్నం రాజధాని విషయంలో జగన్ మరొక అడుగు వేయకుండా కేంద్ర ప్రభుత్వంచే కట్టడి చేయిస్తాను అంటూ బలంగా చెప్పిన పవన్ బలంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన మాట మార్చి ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం సలహాలు ఉండవని దేశంలోని ఏ రాష్ట్రం తమ రాజధానుల విషయమై తీసుకునే నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు అని అర్ధం వచ్చేలా పవన్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో పవన్ అమరావతి విషయమై తాను చేస్తున్న పోరాటంలో కేంద్రప్రభుత్వ పెద్దల పూర్తి సహకారం పొందలేక పోయాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన చర్చా గోష్టిలో ప‌వ‌న్‌కు రాజ‌ధాని అమ‌రావ‌తిలో 62 ఎక‌రాలు పవన్ తల్లి పేరు పై 20 ఎక‌రాల‌ భూమి ఉంద‌ని ఆరోపణలు రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఆ చర్చా గోష్టిలో ఈ ఘాటైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న న్యూస్ ప్రజంటర్ అవి నిజమైన ఆరోపణలేనా అని అడిగినప్పుడు ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం మరింత షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో ఈ ఆరోపణలే నిజం అయితే పవన్ కు ఊహించని షాక్ అనుకోవాలి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అమరావతి రాజధాని రగడ ఇప్పట్లో ఎటూ తేలే పరిస్థితి కనిపించక పోవడంతో తన సినిమాల షూటింగ్ ను పక్కకు పెట్టి ఇలా ఎన్ని రోజులు పవన్ పోరాడగలడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: