మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. రవితేజ ఒక డిఫరెంట్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నభ నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించగా ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వం వహిచడం జరిగింది. వరుసగా మూడు ఫ్లాప్స్ చవిచూసిన మాస్ రాజాకు ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం. ముందుగా మంచి ఆసక్తికర సీన్స్ తో మొదలైన ఈ సినిమా ఫస్ట్ ఇరవై నిముషాలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, ఆ తరువాత నుండి సినిమా ఊపందుకుని ముందుకు సాగుతుందని అంటున్నారు. 

 

ఫస్ట్ హాఫ్ లో చాలవరకు తన అద్భుతమైన డైరెక్షన్ టాలెంట్ చూపిన విఐ ఆనంద్, మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన ట్విస్ట్ ని కూడా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో జోడించాడట. ఇక దానితో ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ పై మంచి ఇంట్రెస్ట్ పెరుగుతుందని, అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకునే రేంజ్ లో సాగదని అంటున్నారు. మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి ఫక్తు రొటీన్ ఫార్ములాను అనుసరించాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. పేరుకు మాత్రం సినిమా గురించి బాగా ప్ర‌చారం చేశారని అయితే సినిమాలో మాత్రం ఊహించినంత విషయం లేదని ప్రేక్షకులు అంటున్నారు. 

 

సైన్స్ ఫిక్షన్ సినిమా, సెటప్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ అవీ ఇవీ అని చెప్పుకుంటూ వచ్చిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ రోల్ అయిన డిస్కో రాజ్ పాత్ర మాత్రమే మెప్పించిందని, మిగతా అంతా సర్వ మంగళ మేళమే అన్నట్లు ఉండడంతో చాలామంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొదలు పెట్టిన సూపర్బ్ సైన్స్ ఫిక్షన్ పాయింట్ ని పక్కన పడేసి రొటీన్ పంథాలో కథని తీసుకెళ్ళడం బోరింగ్ గా అనిపిస్తుందని, ఓవరాల్ గా ఇది కేవలం ఒక యావరేజ్ బొమ్మ మాత్రమే అని తేల్చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: