మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా.  మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసి చాలా కాలమే అయింది. రవితేజ నటించిన గత మూడు సినిమాలు కూడా దారుణమైన పరాభవాన్ని మిగిల్చాయి. మూడు డిజాస్టర్ల తర్వాత విభిన్న‌మైన క‌థ‌తో  డిస్కో రాజా అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.  రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నభ నటేష్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ లు హీరోయిన్స్ గా నటించారు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న రిలీజ్ చేస్తున్నారు.

రామ్ తాళ్లూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్టాఫ్ చూసే స‌రికి చాలా బాగుంద‌న్న అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంది. ఇంటర్వల్ బ్లాక్ అదిరింది, కమాన్ డిస్కో రాజా సెకండాఫ్ కుమ్మేసుకుందాం.! అని ప్ర‌తి ఒక్క‌రు వేడి వేడి చాయో, కాపీయో, పాప్ కార్నో తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. స్కైఫై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి సగం పూర్తయ్యేసరికి అంతా బాగానే సాగింది అని చెప్పాలి. సినిమా ఆరంభమే మంచి టెన్స్ గా మొదలవుతుంది. తాము తీసుకున్న కాన్సెప్ట్ ను విఐ ఆనంద్ అద్భుతంగా ఆవిష్కరించారు.

తాను ఎన్నుకున్న పాయింట్‌ను మంచి ట్విస్టులు మరియు కథనం ద్వారా చూసే ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ని ఇస్తాయి. అలాగే పాటలు కూడా బాగున్నాయి. అయితే సెకండాఫ్ మాత్రం క‌థ ప‌క్క‌దారి ప‌ట్టేసింది. ఇక ఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తుంటే కచ్చితంగా మాస్ రాజా ముందు సినిమాలతో పోలిస్తే బెటర్ ఔట్‌పుట్‌తో వచ్చాడ‌ని వినిపిస్తోంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా.. ఒక్కక్ష‌ణం లాంటి భిన్న‌మైన సినిమాల తర్వాత విఐ ఆనంద్‌ చేసిన సినిమా ఇది. ఇందులో ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: