ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా మూడు ఫ్లాప్స్ చవి చూసిన మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా డిస్కో రాజా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించగా ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. ఇకపోతే నేడు ఫస్ట్ షో నుండి వచ్చిన టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమాకు ఓవరాల్ గా కేవలం పర్వాలేదనిపించే టాక్ మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ లో నటించిన రవితేజ, తన మార్క్ నటనతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. 

 

ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా నడిపాడట దర్శకుడు ఆనంద్. అలానే మధ్యలో వచ్చే ఆసక్తికర సీన్స్ తో పాటు కామెడీ సీన్స్ కూడా బాగున్నాయని, ఇక ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ తో ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి మొదలవుతుందని అంటున్నారు. అయితే అనంతరం ఒకింత మెల్లగా ఆరంభం అయిన సెకండ్ హాఫ్ అంత ఆసక్తికరంగా సాగదని, ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత వెరైటీ గా తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం కూడా రొటీన్ గా నడపడంతో పాటు మధ్య మధ్యలో కొంత ల్యాగింగ్ గా కూడా ముందుకు తీసుకెళ్లాడని, అయితే క్లైమాక్స్ లో వచ్చే అదిరిపోయే ట్విస్ట్ మాత్రం బాగుందని అంటున్నారు. 

 

ఇక డిస్కో రాజగా రవితేజ నటించిన పాత్రని ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు సూపర్బ్ ఎంజాయ్ చేస్తారు, కానీ అది సినిమాలో ఓవరాల్ గా ఒక గంట మాత్రమే ఉంటుందట. మిగతా నడిచిన సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వలన ప్రేక్షకులు నిరాశతోనే బయటకి వస్తారని అంటున్నారు. ఓవరాల్ గా రవితేజ తన పంథా మార్చి చేసిన ఈ సినిమాలో డిస్కో రాజ్ గా కొంతవరకూ మెప్పించినా, అయన నుంచి కోరుకునే కామెడీ, మాస్ ఎలిమెంట్స్ లాంటివి మిస్ అవ్వడం వలన యావరేజ్ బొమ్మ డిస్కో రాజా అనే టాక్ ని తెచ్చుకుంటుందనేది ఈ సినిమాకు వస్తున్న ఫైనల్ టాక్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: