టాలీవుడ్ అగ్ర హీరో మాస్ మహారాజ రవితేజ రాజది గ్రేట్ సినిమా తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. అందువల్ల సినిమా లకు కొంచెం గ్యాప్ తీసుకొని భారీ కథనం తో వచ్చిన సినిమాలో నటించారు. భారీ యాక్షన్ తో హాలీవుడ్ రేంజులో వచ్చిన ఈ సినిమాకు రవితేజ మాస్ లుక్ తో కనిపించి అదరగొడుతున్నాడు.. అయితే ఇంతకీ ఈ సినిమా టైటిల్ చూస్తే నే ఎవరికైనా అర్థమవుతుంది...

 

 

డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. 

 

 

ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ఉన్నప్పుడే ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చింది. అంతేకాకుండా బోరిం గ్ ఏలివెంట్ ఉన్నాయని సినీ విమర్శకులు అంటున్నారు..ఫస్ట్ ఆఫ్ మాత్రం కొంచం హిట్ అవ్వడంత సినిమా అవుతుందని అందరూ అంటున్నారు...

 

 

సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో విజువల్ గా అంతకు మించి ఉండేలా షూట్ చేశారు. ఇక అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. మరీ రవితేజ గత సినిమాల్లాంటి మాస్ డైలాగ్స్ కాదు, కానీ మాస్ అనిపించేలా డిస్కో రాజ్ పాత్రకి డైలాగ్స్ రాసారు. డైలాగుల్లో ర‌వితేజ చెప్పిన విధానం.. అవి పేల‌డం కూడా బాగుంది.. ఎడిటర్ శ్రవణ్ కటికనేని ఓవరాల్ గా ఓకే అనిపించినా అక్కడక్కడా కొంతవరకూ కత్తెర వేసి ఉండచ్చు. బోరింగ్ సీన్స్ ఎక్కువైనప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలడు. మొత్తానికి ర‌వితేజ‌లోని పాత మాస్ కాకుండా కొత్త మాస్‌ను చూశాం. మరీ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: