సినిమాలో అద్భుతమైన వర్క్ తో మెప్పించిన వారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగల. కార్తీక్ విజువల్స్ అండ్ సెట్స్ సినిమాలో పూర్తిగా లీనమయ్యేలా చేస్తే థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ముఖ్యంగా డిస్కో రాజ్ పాత్ర కోసం వీళ్ళు తీసుకున్న కేరింగ్ వల్లే ఆన్ స్క్రీన్ వండర్ఫుల్ గా అనిపిస్తుంది. థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం సూప‌ర్బ్‌.

 

హ్యాట్రిక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న అందించే సాంగ్స్ అన్నీ కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే స‌గం ఆడియోని చూసే సినిమాల‌కు వెళ్ళిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవ‌లె ఆయ‌న సంగీతం అందించిన ప్ర‌తిరోజూ పండ‌గే సూప‌ర్ హిట్ అలాగే అల‌వైకుంఠ‌పురంలో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ మూవీ కూడా అల్లుఅర్జున్ కెరియ‌ర్‌లోనే బెస్ట్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన మూవీ. మ‌రి డిస్కోరాజాలో ఆయ‌న నాలుగు పాట‌లు అందించారు. నాలుగు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక‌పోతే ఇదివ‌ర‌కు బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్ థ‌మ‌న్ అంత బాగా ఇచ్చేవారు కాదు. దేవిశ్రీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటుంద‌నే టాక్ ఉంది. కానీ ప్ర‌స్తుతం అదే టాక్ థ‌మ‌న్ మ్యూజిక్ కి కూడా వ‌స్తుంది.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద‌ర‌గొడుతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి వ‌చ్చే స‌రికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అందించారు థ‌మ‌న్‌. త‌మ‌న్ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్ మెన్‌. ప్ర‌స్తుతం ఆయ‌న మంచి ఫ్లోలో ఉన్నారు.  అందులో చాలామందికి ఫేవ‌రెట్ నువు నాతో ఏమ‌న్నావో ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్‌. ఆ సాంగ్‌కి ఎమోష‌న‌ల్‌గా అంద‌రూ కనెక్ట్ అవుతారు. 

 

సినిమాటో గ్రాఫ‌ర్ కార్తీక్ త‌ను చాలా యంగ్ండ్ డైన‌మిక్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఆయ‌న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఛాలెంజింగ్ గా తీసుకున్న సినిమా అని చెప్పాలి. సినిమాలో మొత్తం మూడు పోర్ష‌న్స్ ఉన్నాయి. రెట్రో, లైవ్‌, సైన్టిఫిక్ పోర్ష‌న్స్ ఉన్నాయి. మూడు టోన్స్ డిఫ‌రెంట్‌గానే ఉంటుంది కానీ ఆర్డ్‌గా ఎక్క‌డా ఉండ‌దు. కాంట్రాస్ట్ ఎక్కువ ఉండ‌కుండా డిఫ‌రెన్స్ ఎక్కువ ఉండాలి. సైన్స్ ల్యాబ్‌లో అంతా కూల్ గా వెళ్ళ‌డం. రెట్రో ఒక టోన్‌లో వెళ్ళారు. లైవ్‌లో ఒక‌ర‌కంగా ఢిల్లీ, చెన్నై పోర్ష‌న్స్ ఉన్నాయి. డిఫ‌రెంట్ ఫ్లేవ‌ర్స్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: