ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభించినప్పటి నుండి ఆ చిత్ర యూనిట్ ఇచ్చే ట్విస్ట్‌లు మామూలుగా లేవు. ఈ సినిమా ఎప్పుడు ధియోటర్స్‌కు వస్తుందో గాని చిత్రబృందం చేసే రచ్చ వల్ల ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.. ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా అందులో మల్టీ స్టారర్ చిత్రం అంతే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో బాహుబలి, సాహో, సైరా ల తరువాత అత్యంత భారీ తెలుగు సినిమా ఇదే. దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్ల సినిమా. ఇంత భారీ సినిమాకు పెట్టుబడి భారీగానే కావాలి. మరి ఇంత మొత్తాన్ని ఎలా సర్దబాటు చేస్తున్నారు నిర్మాత దానయ్య అన్నదే ఇప్పుడు ప్రశ్నలా మారింది...

 

 

ఇదిలా ఉండగా రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న ఈ భారీ సినిమాలో ఇంకా ముందు ముందు ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో.. ఇక ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ విషయంలో తలెత్తే ప్రశ్నలకు సమాధానంగా చాలా విషయాలే వున్నాయట. అదేమంటే ఈ సినిమాకు దానయ్య నిర్మాత అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ అన్ని వ్యవహారాలు దర్శకుడు రాజమౌళినే చూసుకుంటున్నారట. దానయ్యకు ఇంత అమౌంట్ అని ఇచ్చేయడమే. మిగిలిన లాభాలు అన్నీ రాజమౌళివే అని అత్యంత విశ్వసనీయ టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ మేరకు రాజమౌళి నే సినిమాకు ఫైనాన్స్ కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

 

 

ఇక  ఈనాడు రామోజీ గారు బాహుబలి వన్ కు ఫైనాన్స్ చేస్తే, బాహుబలి 2 కు మ్యాట్రిక్స్ ప్రసాద్ తక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేసారు. ఇక ఈ చిత్రానికి రాజమౌళి వేరే ఫైనాన్సియర్ దగ్గర ట్రై చేసారు గాని అది వర్కవుట్ కాక మ్యాట్రిక్స్ ప్రసాద్ ముందుకు వచ్చి, ఫైనాన్స్ రాజమౌళి పేరు మీదనే ఇస్తానని కండిషన్ పెట్టగా దీనికి రాజమౌళి ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ప్రాజెక్టు కు నిర్మాత దానయ్యే అయినా, లాభాల్లో మేజర్ షేర్ రాజమౌళి అండ్ కో దే అని తెలుస్తోంది.

 

 

ప్రస్తుతం ఇలా దానయ్య పేరు ఉండటం వల్ల ఆయన బ్యానర్ కు పేరు, అలాగే ఫిక్స్ డ్ అమౌంట్ లాభంగా లభిస్తుంది. ఇకపోతే రాజమౌళి కుమారుడు కార్తీక్సినిమా మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తుండగా ఇప్పుడు ఒక్క ఆంధ్ర ఏరియానే 100 కోట్ల రేషియోలో చెబుతున్నారు. దానికి కూడా ఒకో ఏరియాకు ఇద్దరి నుంచి ఆరుగురు పోటీ పడుతుండడం విశేషం... 

మరింత సమాచారం తెలుసుకోండి: