మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా. దాదాపు ఏడాదిన్నర తర్వాత డిస్కో రాజా సినిమాతో వచ్చాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఫలితంతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ రాజా. డిస్కో రాజా సినిమాకు ప్రధాన బలం రవితేజ ఎనర్జీ. ఈ సినిమాలో మాస్ మహరాజ్‌ రెండు డిఫరెంట్ లుక్స్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ సినిమాని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న రిలీజ్ చేస్తున్నారు.

రామ్ తాళ్లూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న‌ ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ న‌భా న‌టేష్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్.. తాన్యా హోప్ లు హీరోయిన్స్ గా నటించారు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఈ సినిమాలో డిస్కో రాజ్ గా యాటిట్యూడ్, మ్యానరిజమ్స్, డైలాగ్ మాడ్యులేషన్, స్టెప్స్ సింప్లీ సూపర్బ్.. స్పెషల్ గా ఇంగ్లీష్ లో చూపిన కొన్ని కొన్ని డైలాగ్స్ ఇక అందరినోటా మారుమ్రోగుతాయ్.  ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే రవితేజ మరియు విఆనంద్ ల కాంబోలో తెరకెక్కిన ఈ స్కైఫై థ్రిల్లర్ ఆకట్టుకునే నరేషన్ తో పాటుగా రవితేజ రెండు షేడ్స్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు మెయిన్ ఎస్సెట్ గా మార‌తాయి.

అలాగే సెకండాఫ్ లో అక్కడక్కడా సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. కానీ అది పెద్దగా ఎఫెక్ట్ అనిపించకపోవచ్చు.. మొత్తానికి మాత్రం మాస్ మహారాజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ జానర్ చిత్రంగా నిలుస్తుంది అని చెప్పాలి. సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. అదే సినిమాలో కూడా చూపించాడు దర్శకుడ‌ని చెప్పాలి. మ‌రి థ్రిల్లింగ్ అనిపించే ఈ సినిమాతో ర‌వితేజ హిట్‌ కొడ‌తాడో లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: