దగ్గుబాటి కుటుంబంలో వెంకటేష్ కు మంచి పేరు ఉన్నది. కానీ, రానా కు అంతకు మించి అనేలా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే రానా వరస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా, ఒక ఇండస్ట్రీ అతుక్కుపోకుండా, తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఎంతగా బిజీ అయ్యాడు అంటే, దాదాపుగా అయన ఫ్లైట్ లో తప్పించి నేలపై విడిగా కనిపించేది తక్కువ అని చెప్పే విధంగా మారిపోయాడు. మంచిదే కూడా అలా మారితే.
రానా మంచి హైట్. ఆ హైట్ కు తగ్గట్టుగానే ఫిజిక్. దీంతో పాటుగా యాక్టింగ్ కూడాఅదుర్స్ అనేలా ఉంటుంది. అందుకే అయన సినిమాలు సూపర్ గా ఉంటున్నాయి. లీడర్ సినిమాలో చూసిన రానాకు నేనేరాజు నేనే మంత్రి సినిమాలో చూసిన రానాకు అసలు పోలికలే కనిపించవు. అంతటి అద్భుతంగా నటిస్తున్నాడు. నేనేరాజు నేనే మంత్రి సినిమా రానా కెరీర్లో బెస్ట్ సినిమా అని చెప్పాలి. అందులో నెగెటివ్ రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తూనే మెప్పించారు.
ఇప్పుడు ఈ హీరో విరాటపర్వం సినిమా చేస్తున్నారు. ఇది నక్సలైట్లకు సంబంధించిన సినిమా. ఈ సినిమా చేయడం ఓ సాహసమే. అయితే, ఈ సినిమ పూర్తయ్యాక రానా ఓ సినిమా చేయబోతున్నాడు. తేజ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తున్నది. రాక్షసరాజు రావణాసురుడు అనే టైటిల్ తో సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో రావణుడిగా కనిపించబోతున్నాడు. ఇది ఫాంటసీ సినిమానా లేదంటే పురాణాలకు సంబంధించిన సినిమా అన్నది తెలియాల్సి ఉన్నది.
ఈ సినిమా తరువాత గుణశేఖర్ తో కూడా అయన ఓ సినిమా చేయబోతున్నారు. హిరణ్యకశ్యప సినిమా అది. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే. గుణశేఖర్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఒక్కడు నుంచి చూసుకోవచ్చు. ఇటీవలే గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంతా భారీతనం నిండుకొని ఉంటుంది. సూపర్ సినిమా అది కూడా. సో, రానాలో ఉన్న ఆ మల్టి టాలెంట్ ను ఇలా వాడుకుంటున్నారు. చూద్దాం ఏమౌతుందో.