మాస్ మహారాజా రవితేజ... దర్శకుడు విఐ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డిస్కో రాజా. ఇప్పటికే విఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలు థ్రిల్లింగ్  జోనర్ లో సరికొత్త కథాంశంతో రావడంతో డిస్కో రాజా సినిమా పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ కూడా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. కాగా  సైన్స్  ఫిక్షన్ గా తెరకెక్కిన డిస్కో రాజా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ  సినిమాలో అయినా తన ఎనర్జీతో ప్రేక్షకులలో ఎనర్జీ నింపే రవితేజ.. ఈ సినిమాలో కూడా ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడు రవితేజ. ముఖ్యంగా దర్శకుడు వి.ఐ ఆనంద్ సినిమాను తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. 

 

 

 సినిమా మొత్తం ట్విస్టులతో థ్రిల్లింగ్ గా సాగుతూ ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఆతృత కనిపిస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా డిస్కో రాజా పాత్ర అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. కాగా డిస్కోరాజా పాత్ర మినహా మిగతా ఇద్దరు పాత్రల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ప్రేక్షకులకు. ఇక మొదటి నుంచి మంచి థ్రిల్లింగ్ గా ఎన్నో ట్విస్ట్ ల మధ్య   కథ సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ పెట్టి ప్రేక్షకులందరినీ టెన్షన్లో పెట్టేస్తాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లు కూడా తమ పరిధి వరకు బాగానే నటించారు. 

 

 

 ఇకపోతే సినిమాలో  మరోసారి తన ఎనర్జీతో అదరగొట్టేశాడు మాస్ మహారాజా రవితేజ. కాకపోతే రవితేజ ముఖంలో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. రవితేజ ముఖంలో ముడుతలు స్పష్టంగా కనపడతాయి. ఎప్పుడు ఎనర్జీతో ఫుల్ జోష్ లో ఉండే రవితేజ... ఈ సినిమాలో కూడా డిస్కోరాజా పాత్రలో అదే జోష్  అదే ఎనేర్జి  కంటిన్యూ చేసినప్పటికీ... కాస్త రవితేజ ముఖంలో మాత్రం ముడతలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు వయసు ప్రభావమో లేక మేకప్  ప్రభావమో తెలియదు కానీ ముడతలు  మాత్రం ఈ సినిమాలో బాగా కనపడతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మాస్ మహారాజా రవితేజ ఖాతాలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ హిట్  చేరినట్లే అని ప్రేక్షకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: