‘మన్మధుడు 2’ ఘోర పరాజయం తరువాత నాగార్జున సినిమాలను ఇక ప్రేక్షకులు చూడరా అన్న సందేహాలు కలిగాయి. దీనితో ఈ షాక్ నుండి తేరుకున్న నాగ్ మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగార్జున ఒక ఎన్ ఐ ఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

సినిమా కథ రీత్యా ఎక్కువ భాగం ముంబాయి చుట్టు పక్కల ప్రాంతాలలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నా ఈ మూవీలో కీలకమైన హీరోయిన్ పాత్రకు నాగార్జున పక్కన నటించ గలిగే సరైన హీరోయిన్ దొరకక పోవడంతో నాగ్ కు ఊహించని సమస్య ఎదురైంది. 

అయితే ఇప్పుడు ఈ సమస్యను 38 ఏళ్ల వయసు ఉన్న ఒకనాటి క్రేజీ బ్యూటీతో తీర్చబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన మిస్ ఏషియా పసిఫిక్ కిరీటాన్ని సొంతం చేసుకున్న డియా మిర్జా నాగ్ పక్కన హీరోయిన్ గా ఎంపిక అయింది. హైదరాబాద్ కు చెందిన ఒకనాటి ఈ బ్యూటి షుమారు 12 సినిమాలలో నటించినా ఏ సినిమాల వల్ల సరైన గుర్తింపు లభించక పోవడంతో సినిమాలకు దూరమైన ఈమె ఒక సామాజిక సేవా సంస్థ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోంది. 

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆమెను ఒప్పించి తిరిగి నాగార్జున పక్కన హీరోయిన్ గా ఈ మూవీ ద్వారా రీ ఎంట్రి చేస్తున్నారు. ఈ విషయాలను ఇప్పటి వరకు ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించక పోయినా ఈ బ్యూటీ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన లీకులతో ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. కొత్త దర్శకుడుగా పరిచయం అవుతున్న సోలమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ స్క్రీన్ ప్లే చాల డిఫరెంట్ గా ఉండటమే కాకుండా చాల ఆసక్తి దాయకంగా ఉంటుంది అని అంటున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: