రవి తేజను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఈ మధ్యకాలంలో అయినా ఈ సినిమా తీసిన యావరేజ్.. లేదా ప్లాప్. ఎందుకు ఆలా అవుతుంది? ఇంత టాప్ హీరోకు డైరెక్టర్ ఎంచుకోవడం చాత కావడం లేదా? లేక సినిమా స్టోరీ ఎంచుకోలేక పోతున్నారా? పాపం సమస్య ఎక్కడ వస్తుంది ? ఎందుకు వస్తుంది ? అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే.. 

 

ప్రస్తుతం రిలీజ్ అయినా అతని సినిమా గురించి మాట్లాడుకుందాం.. రవి తేజ హీరోగా తెరకెక్కిన ఈ డిస్కో రాజా సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. అలాంటి ఈ సినిమాలో వెన్నల కిషోర్ పాత్ర హైలెట్ గా నిలిచింది. 

 

అయితే ఇక్కడ ఈ సినిమాలో సమస్య ఎం వచ్చింది అంటే.. డిస్కో రాజ్ పాత్రని కొత్తగా డిజైన్ చేశారు.. ఇక్కడ సక్సెస్ అయ్యాడు. కానీ కథని మాత్రం అదే పాత పద్దతిని ఫాలో అయ్యాడు. దాంతో దెబ్బైపోయాడు. సినిమాలో డిస్కో రాజ్ పాత్ర కనిపిస్తున్నంత సేపు సినిమా ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. 

 

అదే లేకపోతే గాలి తీసేసిన బెలూన్ లా తుస్ అంటూ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో డిస్కో రాజ్ తో క్రియేట్ చేసిన మేజిక్ ని ప్రెజంట్ డిస్కో రాజ్ పాత్రలో చూపించలేకపోవడం మరో మైనస్. అయినా.. ఇప్పటికే రవి తేజ తీసిన సినిమాలు అన్ని అపజయాల పాలవుతున్నాయి.. మళ్ళి ఇప్పుడు కొత్తగా తీసే సినిమాలలో అయినా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కదా.. 

 

డిస్కో రాజా అనే కొత్త పాత్ర సృష్టించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి కదా.. నిజంగానే అన్ని జాగ్రత్తలు తీసుకోని ఉంటె సినిమా హిట్ అయ్యేది.. కానీ ప్రస్తుతం సినిమాకు హిట్ టాక్ రాకపోగా ఇలాంటి మైనస్ లు బయట పడుతున్నాయి. ప్రేక్షకులు కూడా చాలామంది ఎందుకు ఇలా చేశారు అంటూ తలలు పట్టుకుంటున్నారు.. ఏంటో డిస్కో రాజా.. ఈ సినిమా కూడా నీ చెయ్యి జారిపోయింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: