మాస్ మహరాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా డిస్కో రాజా. ఎస్.ఆర్.టి ఎంటర్టైమెంట్స్ బ్యానర్ లో తాళ్లూరి రాం నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, తన్య హోప్ హీరోయిన్స్ గా నటించారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని తెలుస్తుంది. మాములుగా తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు రావడం చాలా అరుదు. అలాంటి ప్రయత్నం చేసే హీరోలు, దర్శకులు కూడా తక్కువే.

 

ఆనంద్ ఎంచుకున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఓకే అనిపించినా మిగతా అంతా రొటీన్ గా నడిపించడంతో సినిమా తేడా కొట్టేసిందని అంటున్నారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నా దాన్ని రెగ్యులర్ పంథాలో కొనసాగించిన తీరు ప్రేక్షకులను మెప్పించలేదు. కాన్సెప్ట్ కు తగినట్టుగా స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటే డిస్కో రాజా రేంజ్ వేరేలా ఉండేదని తెలుస్తుంది. వి.ఐ.ఆనంద్ లైన్ బాగున్నా రొటీన్ ట్రీట్మెంట్ సినిమా అంచనాలను అందుకోకుండా చేసింది.

 

అయితే ఉన్నంతలో రవితేజ పర్ఫార్మెన్స్, హీరోయిన్స్ అందాలు సినిమాను కొంతమేరకు కాపాడాయని తెలుస్తుంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన వి.ఐ.ఆనంద్ రవితేజతో తీసిన సైఫై మూవీ డిస్కో రాజా. సినిమా ఓపెనింగ్ సీన్స్.. కొన్ని వావ్ ఫ్యాక్టర్స్ బాగున్నా ఓవరాల్ గా మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదన్నది టాక్. అయితే అసలు సినిమా రిజల్ట్ ఏంటన్నది మాత్రం మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడిన ఈ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో రవితేజ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: