విజయ్ దేవరకొండ తో పోలిస్తే సమంత సీనియర్ నటి మాత్రమే కాకుండా ఆమె క్రేజ్ దక్షిణాది సినిమా రంగంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే విజయ్ దేవరకొండ సమంత దారులను మూసి వేయడంతో ఆమె రాజీ పడ్డ ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

సమంత శర్వానంద్ లు జంటగా నటిస్తున్న తమిళ మూవీ ‘96’ మూవీ రీమేక్ కు ‘జాను’ అన్న పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఈ మూవీలోని పాటకు స్పందన బాగా రావడంతో ఈ మూవీ నిర్మాత దిల్ రాజ్ మంచి జోష్ లో ఉన్నాడు. 

వాస్తవానికి ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు. అయితే అదేరోజున జరగబోతున్న వాలెంటైన్స్ డేను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ తన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీని విడుదల చేస్తున్న నేపధ్యంలో దిల్ రాజ్ ఆలోచనలు మారినట్లు సమాచారం. విజయ్ దేవరకొండకు ఉన్న మ్యానియా రీత్యా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా ఆ మూవీని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. 

దీనితో విజయ్ దేవరకొండ మ్యానియా ముందు సమంత నిలబడటం కష్టం అని భావించిన దిల్ రాజ్ ‘జాను’ మూవీని ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ అయ్యేలా డేట్ ను మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీనితో ఈ సినిమా ప్రమోషన్ ను ఈ నెలాఖరు నుండి ప్రారంభించి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి రెండవ తారీఖు జరిపే విధంగా దిల్ రాజ్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. అయితే విజయ్ దేవరకొండ సినిమాకు ఒక వారం రోజులు ముందుగా సమంత సినిమా వచ్చినా ఆ తరువాత సునామీలా దూసుకు వచ్చే విజయ్ మ్యానియా ముందు సమంతా శర్వానంద్ ల క్యూట్ లవ్ స్టోరీ నిలబడుతుంద అన్న సందేహాలు ఉన్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: