ఈ సంవత్సరం రాశీ ఖన్నాకి బానే కలిసి వచ్చేలా ఉంది.  ౨౦౧౯ చివరి వారంలో విడుదల అయిన రెండు చిత్రాలు ఆమె కెరీర్లో మంచి విజయాలు సాధించాయి. ఆ సినిమాల్లో ఆమె పాత్ర ఎక్కువగా లేనప్పటికీ సినిమా విజయం సాధించడం కూడా ఇంపార్టెంటే కాబట్టి.. ఆ విషయంలో ఆమె ఫుల్ జోష్ లో ఉంది. అప్పటి వరకు ఫ్లాపులతో సతమతమవుతున్న తనకి ఈ రెండు చిత్రాలు కొంత తెరపిని ఇచ్చాయి.

 

 

 

ఇక ప్రస్తుతం ఆమె నుండి మరో చిత్రం రాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఉన్న నలుగురు హీరోయిన్లలో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ప్రేమికుల రోజు కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం మీద రాశీ ఖన్నా ఆశలు పెట్టుకుంది.

 

 

 


అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకుందట. మొదటి సారిగా తన పాత్రకి తానే చెప్పుకుంది రాశీ ఖన్నా... ఇక ఈ సినిమాలో తాను చేసే పాత్ర ప్రత్యేకంగా నిల్చిపోతుందని చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది అవుతుందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

 

 

 

ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖాన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజబెల్ల ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: