‘అల వైకుంఠపురములో’ మూవీ ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న బన్నీ  కలెక్షన్స్ దాహాని తీరుస్తోంది. ఈ రోజు విడుదల అయిన ‘డిస్కో రాజా’ మ్యానియా సగటు ప్రేక్షకులలో పెద్దగా కనిపించక పోవడంతో  ‘అల’ ఈ ఏడాది తోలి బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. 

దీనితో మంచి జోష్ లో ఉన్న బన్నీ సుకుమార్ తో నటించే తన తదుపరి సినిమాకు రెడీ అవుతూనే ఇదే జోష్ లో అతడు భాగ్యనగరం లో నిర్మించబోయే అతి పెద్ద ఇంటి డిజైనింగ్ ప్లాన్స్ లో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 100కోట్ల ఖర్చుతో నిర్మిచే బన్ని ఇల్లు నిజమైన ‘వైకుంఠపురం’ లా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు. 

వాస్తవానికి బన్నీకి ఇలాంటి భారీ ఇంటి నిర్మాణం ఆలోచనలు కలుగ చేసింది   ‘అల వైకుంఠపురం’ షూటింగ్ జరిగిన భారీ భవంతి అని అంటున్నారు.  ఒక రాజభవనం లా కనిపించే ఆ ఇల్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత కూతురు అత్తవారిది అన్న విష్యం తెలిసిందే. ఆ ఇంటిని మించి ఉండేలా తన కొత్త ఇంటిని డిజైన్ చేసే బాధ్యతను ముంబైలోని ఒక  ప్రముఖ ఆర్కిటెక్ట్ కు బన్ని అప్పగించాడని తెలుస్తోంది.  

తన తండ్రి  అల్లు అరవింద్ కు సంబంధించిన స్థలంలో ఈ ఇంటి నిర్మాణం బన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిలో ప్రతి విషయం ప్రత్యేకంగా ఉండాలని అన్ని వసతులతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉండేలా బన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక  ఎవరైనా ఇంట్లో అడుగు పెడితే మతి పోయేలా ఉండబోతుందని ఈ ఇల్లు ఇండస్ట్రీలోని ఏ ప్రముఖ హిరోకి ఉండదని ఆ విధంగా బన్నీ ప్లాన్స్ కొనసాగుతున్నాయని అని అంటున్నారు. దీనితో ఇండస్ట్రీలోకి వచ్చిన 17 సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ కలలు ఒకదాని తరువాత మరొకటి తీరుతూ బన్నీ ని టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం రేస్ లో పరుగులు తీసేలా చేస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: