మాస్ మహారాజ రవితేజ ఇటీవల రిలీజ్ అయిన తన మూడు సినిమాలతో ఫ్లాప్స్ అందుకుని ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశలో పడేసాడు. అయితే చివరికి కొంత ఆలోచన చేసిన రవితేజ, తన తదుపరి సినిమాని ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీసిన విఐ ఆనంద్ తో చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇటీవల పూర్తి అయిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తన జానర్ లోనే దర్శకుడు ఆనంద్ ఈ సినిమాని కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రవితేజ సరసన అందాల భామలు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెలకిషోర్, బాబీ సింహా, తాన్యా హోప్, అజయ్, సత్య, సత్యం రాజేష్, రామ్ కి, రఘు బాబు తదితరులు నటించారు. 

 

ఇక నేడు ఈ సినిమాకు ఓవరాల్ గా యావరేజ్ టాక్ లభించినట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటివరకు నటించిన సినిమాల్లోకి ఈ సినిమా చాలావరకు డిఫరెంట్ గా ఉంటుందని, అయితే ఫస్ట్ హాఫ్ ని మంచి ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో మాత్రం రొటీన్ ఫార్ములాని అనుసరించాడని అంటున్నారు. తెలుగులో సైన్స్ ఫిక్ష‌న్ కాన్సెప్ట్ సినిమాలు రావ‌డం అరుదు.అందులోనూ సైన్స్ ఫిక్ష‌న్ పాయింట్ తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించ‌డం క‌ష్టం, ఇక ఇందులో దర్శకుడు ఆనంద్ మంచి సైన్స్ ఫిక్ష‌న్ క‌థ తీసుకుని ఫ‌స్టాఫ్ మెప్పించినా సెకండాఫ్ స‌రిగా డీల్ చేయ‌లేదని తెలుస్తోంది. 

 

పేరుకే సైన్ ఫిక్షన్, కానీ కథ మాత్రం పరమ రొటీన్ అని, ఇక రవితేజ అభిమానులు కోరుకునే అంశాలు తక్కువ కావడంతో పాటు ఓవ‌రాల్‌గా ఈ గుడ్ కాన్సెప్ట్ ని మరింత బాగా ప్ర‌జెంట్ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరుగా ఉండేదని చెప్తున్నారు. తీసుకున్న లైన్ బాగున్నా, ప్రెజెంటేషన్ లో రోటీన్ ట్రీట్మెంట్‌ ఇవ్వడంతో సినిమా అంచ‌నాలు అందుకోలేదట. ఇక హీరోగా రవితేజ ఎప్పటివలె ఎంతో బాగా నటించి ఆకట్టుకున్నారని, కొన్ని విజువల్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టుల వంటివి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: