టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఫృథ్విరాజ్.  కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు ఫృథ్వి.   క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశి తెరకెక్కించిన ‘ఖడ్గం’ మూవీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ ఫృథ్వి డైలాగ్స్ బాగా వర్క్ ఔట్ అయ్యింది.  అప్పటి నుంచి సినీ పరిశ్రమలో ఫృథ్విని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఊతపదంగా మారింది.  గత కొంత కాలంగా ఫృథ్వి పెరడీ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్న విషయం తెలిసిందే.  స్టార్ హీరోలను ఇమిటేట్ చూస్తే పేరడీ డైలాగ్స్ తో ఫృథ్వి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్నాడు.  అప్పటి నుంచి  ఇండస్ట్రీలో కమెడియన్ పృథ్వీ బిజీ యాక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ మంచి బిజీగా ఉన్న ఫృథ్వి అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్లారు.

 

 గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పార్టీపై ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేశారు.  అంతకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప’యాత్రలో పాల్గొని వైసీపీ జెండా మోశారు.  రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఫృథ్వి చేసిన కామెంట్స్ కొందరి మనోభావాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అయితే దీనికి ఎఫెక్ట్ ఆయన సినీ కెరీర్ పై పడిందని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. కానీ ఫృథ్వి మాత్రం తనకు సినిమాల్లో ఢోకా లేదని వాదిస్తూ వచ్చారు.  విచిత్రం ఏంటంటే అప్పటి నుంచి ఫృథ్వి వెండి తెరపై కనిపించడం మానారు. అంతే కాదు ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో ఫృథ్వి ఓ పాత్ర మిస్ అయినట్లు టాలీవుడ్ గుస గుస.

 

 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ముందుగా పృథ్వీ కోసం ఓ రోల్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ బన్నీ మాత్రం ససేమిరా అన్నట్టు టాక్. అయితే పృథ్వీ మిస్ చేసుకున్న రోల్ ఏంటంటే..? సినిమాలో టబుకి సోదరుడిగా కనిపించిన హర్షవర్ధన్ పాత్ర అని అంటున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఓ మహిళతో పృథ్వీ జరిపిన ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అయిన సంగతి తెలిసిందే.  దీంతో ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: