ఉదయనిధి స్టాలిన్ అంటే తెలుగువారు గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు కాని.. దివంగత మహానేత కరుణానిధి మనమడు కాస్త ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. గతంలో ఒరు కల్ ఒరు కన్నాడి' సినిమాను తెలుగులో `ఓకే ఓకే` టైటిల్ తో రిలీజ్ చేసి ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించాడు. ఆ త‌ర్వాత మళ్ళీ కనిపించని ఉదయనిధి తమిళ్ లో సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. అంతేనా అంటే కాదండోయ్‌.. మ‌రోవైపు రాజకీయాల్లోనూ కొనసాగుతూ జనాలను ఆకర్షిస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఉదయనిధి `సైకో` సినిమాలో న‌టించాడు. థ్రిల్లర్‌ చిత్రాల దర్శకుడు మిస్కన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని డబుల్‌ మీనింగ్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో అరుళ్‌మొళి మాణిక్కం నిర్మిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్‌, నిత్యమేనన్‌, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్‌ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు.   అందుకు కారణం.. సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చడం ఒక కారణమైతే, ‘సైకో’ ట్రైలర్‌ మరొక కారణం. ఇక ఈ ఏడాది ప్రారంభంలో 'కన్నె కలైమానె' సినిమాతో మంచి హిట్ అందుకున్న స్టాలిన్.. ఇప్పుడు 'సైకో'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఉదయనిధికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా తెలుసని చెబుతున్నారు.

సౌకో సినిమా సంద‌ర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. మా తన తండ్రికి జగన్ చాలా ఏళ్లుగా తెలుసని చెప్పిన ఉదయ నిధి.. ప్రమాణస్వీకారం రోజున రాజకీయాల ప్రస్తావన పెద్దగా రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తమ ఇంటికి వచ్చారన్నారు. ఆయనతో కూడా తనకు పరిచయం ఉందన్నారు. ఉద‌య‌నిధి స్టాలిన్‌, స్టాలిన్ కొడుకు గ‌తంలో తండ్రి, తాత‌తో క‌లిసి వీళ్ల‌ను క‌లిశాడు కూడా. అలాగే మ‌రో విష‌యం ఏంటంటే..  సైకో చిత్రనిర్మాణ సమయంలో పగటిపూట పార్లమెంటు ఎన్నికల ప్రచారం, రాత్రి చిత్రం షూటింగ్స్‌ జరిగాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: