పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రెండేళ్ల క్రితం సరిగ్గా సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అజ్ఞాతవాసి అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ 25వ సినిమా కావడం, దానితో పాటు పవన్, త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన గత రెండు సినిమాలైన జల్సా, అత్తారింటికి దారేది రెండూ కూడా మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, తప్పకుండా మూడవ సినిమా అయిన అజ్ఞాతవాసి కూడా సూపర్ హిట్ కొట్టి వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు చేస్తుందని పవన్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ప్రేక్షకులు కూడా భావించారు. 

 

అయితే ఎట్టకేలకు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలవడంతో దానిని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి మరింతగా ఘోరంగా మారింది. కొన్ని ఏరియాల్లో ఎంతో దారుణమైన కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాకు అప్పట్లో నిర్మాత అయిన ఎస్ రాధాకృష్ణ కొంత మొత్తం తిరిగి ఇచ్చినప్పటికీ కూడా ధీ వారి నష్టాలను చాలావరకు పూడ్చలేదని, నిజానికి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాలు పూడ్చాలంటే ఆ సినిమాను నిర్మించిన హారిక హాసిని వారి నుండి మంచి సక్సెస్ఫుల్ సినిమా రావలసిందే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో మంచి టాక్, ని అలానే కలెక్షన్ ని సంపాదించడం జరిగింది.

 

అలానే ఆ సినిమాని కూడా గతంలో అజ్ఞాతవాసిని కొనుగోలుచేసి మెజారిటీ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం, ఇక అనుకున్న విధంగా సినిమా మంచి సక్సెస్ సాధించడంతో డిస్ట్రిబ్యూటర్లు చాలా వరకు డబ్బులు రాబట్టుకుని గట్టెక్కినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పవన్ సినిమాతో మునిగిపోయిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు బన్నీ సినిమాతో చాలా వరకు గట్టెక్కడంతో దర్శకుడు త్రివిక్రమ్, హారిక హాసిని సంస్థ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: