టాలీవుడ్ లో ఒకప్పుడు ఏడాదికి 120 నుంచి 130 వరకూ స్ట్రెయిట్ సినిమాలు వచ్చేవి. అందులో స్టార్ హీరోల సినిమాల శాతం ఎక్కువే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో కూడా వారు ఏడాదికి ఐదారు సినిమాలకు పైగానే చేసేవారు. చిరంజీవి టైమ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి అదే సంఖ్యలో వచ్చేవి. కానీ.. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో ఈ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఏడాదికి ఓ సినిమా వస్తే గొప్ప. భారీ సినిమా అయితే ఏడాదికో, రెండేళ్లకో వస్తోంది.

 

 

ఈ విషయంలో తమిళ హీరోలు మనవాళ్ల కంటే స్పీడ్ ఉన్నారని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150 తర్వాత సైరా రావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. సైరా తర్వాత సినిమా మొదలవడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. అదే తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. పెట్టా, దర్బార్ తో ఏడాదిలో రెండు సినిమాలు వచ్చాయి. శివ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కించేశాడు. మరో స్టార్ హీరో విజయ్ కూడా సినిమాలు చేయడంలో వేగంగా ఉన్నాడు. మెర్సల్, సర్కార్, బిగిల్ చేసాడు. ఇప్పుడు మాస్టర్ చేస్తున్నాడు.

 

 

తమిళ హీరోలంతా స్పీడ్ లో ఉంటే తెలుగు హీరోలు మాత్రం ఆలస్యంగా సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ కు లాక్ అయ్యారు. తర్వాత సినిమాల సంగతి ఇంకా తేలలేదు. మహేశ్ వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఏడాదికి ఒకటి మాత్రమే వస్తోంది. ప్రభాస్ సినిమా ఏడాదికో రెండేళ్లకో వస్తోంది. బన్నీ సినిమాలు కూడా ఏడాదికి ఒకటే. స్టార్ హీరోల సినిమాలు వస్తేనే పరిశ్రమ, ధియేటర్లు కళకళలాడేది. ఈ విషయంలో మన హీరోలు, దర్శకుల ఆలోచనలు మారాల్సిన అవసరం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: