వరస పరాజయాల తరువాత  మాస్ మహారాజా  రవితేజ  ఈరోజు  డిస్కోరాజా తో  మరో సారి  తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో  ఈసారి కూడా రవితేజ పూర్తిగా  సక్సెస్ కాలేదు. రవితేజ సినిమా అనగానే  ప్రేక్షకులు ఆశించేవి  కామెడీ , యాక్షన్.  ముఖ్యంగా  ఫ్యామిలీ  ఆడియెన్స్  రవితేజ సినిమాలో కామెడీ గ్యారెంటీ అని థియేటర్లకు వస్తారు  అయితే ఈ విషయంలో గత మూడు సినిమా లనుండి  నిరాశ పరుస్తూ వస్తున్న రవితేజ  డిస్కోరాజా  తో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. ఈ చిత్రంలో  యాక్షన్ ఓకే అనిపించినా  కామెడీ  ప్లాప్ అయ్యింది.  
 
రవితేజ ఉంటే  స్టార్ కమెడియన్లు  అవసరం లేదు  తన టైమింగ్  తో ఎవరి తోనైనా కామెడీ పండించగలడు.  కానీ ఈ చిత్రం లో  అలాంటి సన్నివేశాలు  లేకపోవడం అలాగే  కథ కూడా అందుకు తగ్గది కాకపోవడంతో కామెడీ విషయం లో రవితేజ కూడా ఏం చేయలేకపోయాడు.  ఓవరాల్ గా  సినిమాలో ఫస్ట్ హాఫ్  బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చే సరికి  సినిమా ను రొటీన్ గా మార్చేశాడు దర్శకుడు. అయితే రవితేజ గత చిత్రాలు టచ్ చేసి చూడు ,నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటొని కంటే  డిస్కో రాజా చాలా బెటర్.  
 
అయితే  సినిమాలో  రవితేజ ప్రధాన బలమైన  కామెడీ  లేకపోవడం అలాగే సెకండ్  కూడా అంత ఎంగేజింగ్ లేకపోవడం తో ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద  ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ విఆనంద్ డైరెక్షన్ లో  సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన  ఈ చిత్రంలో  నాభా నటేష్ , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ , తాన్యా హోప్  కథానాయికలుగా నటించగా థమన్ సంగీతం అందించాడు. నేల టిక్కెట్టు  నిర్మాత రవి తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: