మాస్ మహారాజా రవితేజ హీరోగా... విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డిస్కోరాజా. విభిన్నమైన కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం. ఇప్పటికే విఐ ఆనంద్ కు ఎక్కడికి పోతావు చిన్నవాడా... ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథను తెరకెక్కించిన అనుభవం ఉండడంతో డిస్కో రాజా  సినిమాను కూడా అదే లైన్ తీసుకుని తెరకెక్కించారు దర్శకుడు వీఐ ఆనంద్. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా... వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు దీంతో  డిస్కో రాజా సినిమా పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రవితేజ అభిమానుల్లో  కూడా భారీగా అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 


 సైన్స్ ఫిక్షన్ కథ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంతో విఐ ఆనంద్ తనదైన పనితనం ఈ సినిమాలో చూపెట్టారు. ఇక ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో  డిస్కోరాజా పాత్రలో నటించిన మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్ తో అదరగొట్టేశాడు. ఈ సినిమాలో రెండు షేడ్స్ లో  నటించిన రవితేజ రెండు చోట్ల ప్రేక్షకులు ఆకట్టుకున్నాడు. దీంతో మాస్ మహారాజా రవితేజ అభిమానులు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. 

 

 కానీ రవితేజ అభిమానులను మినహా మిగతా వారిని మాత్రం ఈ సినిమా మెప్పించలేక పోతుంది అని టాక్ వినపడుతోంది. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ లో మాత్రం దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఫస్టాఫ్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో  సెకండాఫ్ విషయంలో మాత్రం అంత బోరింగ్  ఉంటుంది అంటూ చెబుతున్నారు. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో.. రొటీన్ డ్రామాని తెరకెక్కించారు అని ప్రేక్షకులు అంటున్న మాట. లాబ్ ఎక్స్పరిమెంట్ కి దర్శకుడు షుగర్ కోట్  వేసినట్లుగా ఈ సినిమా ఉంది అంటూ టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమా అని రొటీన్ రివెంజ్ డ్రామాని తెరకెక్కించారు దర్శకుడు వీఐ  ఆనంద్. మొత్తంగా అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: