తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి పిల్లలా అందరిని ఎంతగానో అలరించిన హీరోయిన్ జెనీలియా. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ... తనదైన స్టైల్ చిలిపితనం తో కూడిన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ అమ్మడు. జెనీలియా నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. జెనీలియా నటన లో ఏదో మ్యాజిక్ ఉంటుంది.. అందుకే జెనీలియా నటన చూడడానికి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే గతంలో  వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ అమ్మడు... టాలీవుడ్ లోనే కాదు తమిళ కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. 

 

 

 ముఖ్యంగా జెనీలియా నటించిన సినిమాల్లో తన పాత్రలన్నీ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. సిద్ధార్థ జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ  సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది. హాసినిగా  జెనీలియా పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు.ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై  చెప్పేసింది ఈ అమ్మడు. ఎంతో మంది దర్శక నిర్మాతలు సినిమాలో నటింపజేసేందుకు జెనీలియా ను సంప్రదించినప్పటికీ... జెనీలియా మాత్రం సినిమాలు చేయలేదు. ఇక ఆ తర్వాత కొడుకు పుట్టాక పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయింది జెనీలియా. 

 

 

 ఇక ప్రస్తుతం భర్త రితేష్ దేశ్ముఖ్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న జెనీలియా త్వరలోనే నటిగా కూడా తెరపై కనిపించబోతోంది అని టాక్ వినిపిస్తోంది. పెళ్లయిన తర్వాత కొన్నేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ సినిమాల వైపు దృష్టి మళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు అల్లరి చేస్తూ తన చిలిపి నవ్వుతోనే ప్రేక్షకుల మతి పోగొట్టిన జెనీలియా ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేరు. అందుకే ఇప్పుడు జెనీలియా ఒకవేళ సినిమాల్లోకి రావాలి అంటే... హీరోయిన్ గా నైనా అవకాశాలు రావాలి లేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలే అయినా చేయాలి. కాగా  మంచి కథలు వస్తే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి అభ్యంతరం లేదు అని చెబుతోంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న ఈ అమ్మడు తన ఫిజిక్ పై  కూడా బాగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలు పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: