టాలీవుడ్ లో వరుస అపజయలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. క్లారిటీగా చెప్పాలంటే.. 'రాజా ది గ్రేట్' అనంతర సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న ర‌వితేజ మళ్ళీ నెల టిక్కెట్టు, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో డిజాస్టర్ ఊబిలో చిక్కుకున్నాడు. దీంతో చాలా గ్యాప్ త‌ర్వాత  డిస్కో రాజా అంటూ వచ్చాడు రవితేజ. డిఫెరెంట్ సినిమాలు చేసే విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం అందించ‌డంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లు ర‌వితేజ స‌ర‌స‌న న‌టించాడు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఎన్నో అంచ‌నాలు మ‌ధ్య నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇక‌ ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఒక స్కై ఫై కథతో రెడీ అయ్యాడు మాస్ మ‌హారాజ్‌. అయితే అయితే ఫస్ట్ హాఫ్ ని మంచి ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో మాత్రం రొటీన్ ఫార్ములాని కంటిన్యూ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక సినిమాలో ప్రేక్ష‌కుడికి న‌చ్చే మూడు ఎలిమెంట్స్‌లో.. స్టాటింగ్‌ ల‌డ‌క్‌లో వ‌చ్చే సీన్స్‌.. ఇంట‌ర్వెల్ బ్యాంగులో శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్స్ ద‌గ్గ‌ర ఉండేది డిస్కోరాజా అని తెలిసే సంద‌ర్భం.. ఇక క్లైమాక్స్ v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ మెయిన్ విల‌న్ అని వ‌చ్చే ట్విస్ట్.

ఇవి త‌ప్ప సినిమాలో చెప్పుకోద‌గ్గ అంశాలేవీ లేవు. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ తాను రాసుకున్న రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు 1980 బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి, గొప్ప సైంటిఫిక్ యాక్ష‌న్ మూవీ అనే రేంజ్‌లో బిల్డ‌ప్ ఇచ్చేశాడు. కానీ ప్రేక్ష‌కుడి స‌హనానికి సినిమా ఓ ద‌శ‌లో ప‌రీక్ష పెడుతుంది. ఓవ‌ర్ ఆల్‌గా చెప్పాలంటే.. సినిమా కాన్సెప్ట్ వ‌ర‌కు ఒకే అయినా.. స‌రిగ్గా క‌థ‌ను న‌డిపించ‌లేక‌పోవ‌డం మైనెస్ అయింది. ఇక ఫ‌స్టాప్ బాగున్నా.. సెకెండాఫ్ వ‌చ్చే స‌రికి బోరింగా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. రామ్ తాళ్లూరి ప్రొడక్షన్ డిజైనింగ్ మాత్రం విజువల్ వండర్ అనిపించుకుంది. మ‌రి ఈ సినిమా ముందు ముందు ఎంత వ‌ర‌కు హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: